Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ హ‌డావిడి మొద‌ల‌వ్వ‌బోతోంది

By:  Tupaki Desk   |   3 March 2022 8:30 AM GMT
కేజీఎఫ్ హ‌డావిడి మొద‌ల‌వ్వ‌బోతోంది
X
క‌రోనా కార‌ణంగా గ‌త కొంత కాలంగా వ‌రుస‌గా వాయిదా ప‌డుతున్న భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాలు ఒక్కొక్క‌టిగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ముందుగా భారీ చిత్రాల ప‌రంగ‌ప‌ర ద‌క్షిణాదిలో టాలీవుడ్ నుంచి ప్రారంభిం అయింది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్‌` రిలీజ్ అవుతుండ‌గా ఆ త‌రువాత అంత‌కు మించిన స్టాయిలో ఆర్ ఆర్ ఆర్‌` రాబోతోంది. ఇదిలా వుంటే ఇదే వ‌రుస‌లో మ‌రో క్రేజీ ఫిల్మ్ థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేయ‌డానికి రెడీ అయిపోతోంది. అదే `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`.

దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 8న ట్రైల‌ర్ రిలీజ్ కానుందంటూ వార్త‌లు షికారు చేశాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని ప్ర‌క‌టించిన చిత్ర బృందం గురువారం బిగ్ అప్ డేట్ ని అందించిన ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేసింది. ఈ మూవీ ట్రైల‌ర్ ని మార్చి 27న రాత్రి 6:40 గంట‌ల‌కి విడుద‌ల చేస్తున్న‌ట్టుగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డిస్తూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది.

అయితే కేజీఎఫ్ మేక‌ర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ చేస్తున్న ప్ర‌చారంపై య‌ష్ అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ పెద‌వి విరుస్తున్నార‌ట‌. ఈ మూవీ టీజ‌ర్ ని విడుద‌ల చేసిన ఏడాది దాటుతోంది. టీజ‌ర్ తో స‌ర్ ప్రైజ్ కి లోనైన అభిమానులు ట్రైల‌ర్ ఏ రేంజ్ లో వుంటుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం మొద‌లుపెట్టారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 8న హీరో య‌ష్ పుట్టిన రోజు సందర్భంగా టీజ‌ర్ ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే ఒక్క రోజు ముందే టీజ‌ర్ నెట్టింట లీక్ కావ‌డంతో అదే రోజు అఫీషియ‌ల్ గా మ‌రో సారి మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

అప్ప‌టి నుంచి ఈ మూవీ ట్రైల‌ర్ ఎలా వుండ‌బోతోందా? .. దీన్నిమేకర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం మొద‌లుపెట్టారు. గ‌త కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కుల‌క మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించిన వార్త జోష్ ని నింప‌కుండా నీర‌సాన్ని క‌లిగించింద‌ట‌. ఈ వారం విడుద‌ల చేస్తార‌ని భావించిన ట్రైల‌ర్ ని ఈ నెలాఖ‌రున విడుద‌ల చేస్తుండ‌టంతో ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యార‌ట‌. ఏకంగా ట్రైల‌ర్ కోసం 24 డేస్ ఎదురుచూడాల్సి రావ‌డం నిరుత్సాహాన్ని క‌లిగిస్తోంద‌ని చెబుతున్నారు.

24 రోజుల త‌రువాత రిలీజ్ చేసే ట్రైల‌ర్ కోసం ఇంత ఎర్లీగా ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేయ‌డం ఎంటో అని నెట్టింట అభిమానులు కామెంట్ లు చేస్తున్నార‌ట‌. ఏది ఎలా వున్నా మొత్తానికి ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ని అయితే ప్ర‌క‌టించార‌ని, ఈ విష‌యంలో హ్యాపీ అని చెబుతున్నార‌ట‌. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ఏప్రిల్ 14న కాబోతున్న విష‌యం తెలిసిందే. మార్చి 27న దాదాపు మూడు వారాల ముందు ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే సినిమాపై మ‌రింత బ‌జ్ ని క్రియేట్ చేయొచ్చ‌న్న‌ది మేక‌ర్స్ ఆలోచ‌న‌.

ఆ కార‌ణంగానే మార్చి మొద‌టి వారంలో విడుద‌ల చేయాల‌నుకున్న ట్రైల‌ర్ ని మార్చి చివ‌రి వారంలో రిలీజ్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ట్రైల‌ర్ రిలీజ్ తో దాదాపు 20 రోజుల‌ ముందే కేజీఎఫ్ హ‌డావిడి మొద‌ల‌వ్వ‌బోతోందన్న మాట. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఏ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 14 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.