Begin typing your search above and press return to search.

పరిచయంతోనే పాన్ ఇండియా స్టారైన ఆ కుర్రాడు ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్‌

By:  Tupaki Desk   |   5 March 2022 8:34 AM GMT
పరిచయంతోనే పాన్ ఇండియా స్టారైన ఆ కుర్రాడు ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్‌
X
గాలి జనార్థన్ రెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ వ్యక్తి గురించి సౌత్ ఇండియాలోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా అందరికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా సౌత్‌ లో ఆయన కు ఉన్న గుర్తింపు అలాంటిది ఇలాంటిది కాదు. బంగారు బాబు అని.. ఇంకా రకరకాల పేర్లతో ఆయన్ను జనాలు పిలుచుకుంటారు. సంపాదనలో అగ్రగామిగా నిలిచిన గాలి జనార్థన్ రెడ్డి దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న బిజినెస్ మ్యాన్‌.

ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు కిరీటి హీరోగా ఒక సినిమా రాబోతుంది. సాయి కొర్రపాటి నిర్మాణంలో కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన ఆ సినిమా గురించి పాన్‌ ఇండియా స్థాయిలో చర్చ మొదలు అయ్యింది అనడంలో సందేహం లేదు. గాలి తనయుడు అంటూ జాతీయ స్థాయి మీడియా కూడా ప్రముఖంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను చేయడం జరిగింది.

తెలుగు లో రూపొందబోతున్న ఆ సినిమా ను ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. చూడ్డానికి క్యూట్‌ గా ఆకట్టుకునే విధంగా ఉన్న కిరీటి గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అతడు పాన్ ఇండియా స్టార్‌ గా మారి పోయాడు. ఇంకా ఒక్క సినిమా కూడా చేయకుండానే అప్పుడే పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకా సినిమా విడుదల కాకుండానే ఇంతగా గుర్తింపు దక్కించుకున్న ఈ యంగ్‌ హీరో కు మన యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం అంటున్నారు. ఆయన సన్నిహితులతో కలిసి ఎన్నో సార్లు ఎన్టీఆర్‌ సినిమాను మొదటి రోజు చూసిన సందర్బాలు ఉన్నాయట. తాజాగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అంటే విపరీతమైన అభిమానం అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ అంటే బాలీవుడ్‌ స్టార్స్ ల్లో కూడా చాలా మందికి కూడా అభిమానం ఉంటుంది. కిరీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవరం లేదు. ఎన్టీఆర్ మరియు సాయి కొర్రపాటి కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. ఆ సంబంధం తోనే కిరీటి సినిమా ముందు ముందు ప్రమోషన్ కు తప్పకుండా ఎన్టీఆర్‌ హాజరు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సాదారణంగానే తన సన్నిహితుల సినిమాల ప్రమోషన్స్ కు ఎన్టీఆర్‌ హాజరు అవుతాడు. అలాంటిది ఆయన కు అత్యంత వీరాభిమాని అయిన కిరీటి కోసం హాజరు కాకుండా ఎలా ఉంటాడు అంటూ కొందరు అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ సినిమా ల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ఆయన సినిమా వచ్చి ఏళ్లు కావస్తుంది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఎక్కువ సమయం తీసుకుంటున్న కారణంగా తదుపరి సినిమా మరింత సమయం పట్టేలా ఉందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత అయినా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను ఎన్టీఆర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.