Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఇంటి కోసం ₹ 5 కోట్లు ఖర్చు చేస్తున్న దర్శకుడు..?

By:  Tupaki Desk   |   11 March 2022 3:48 PM GMT
ప్రభాస్ ఇంటి కోసం ₹ 5 కోట్లు ఖర్చు చేస్తున్న దర్శకుడు..?
X
టాలీవుడ్ లో కమర్షియల్ కామెడీ చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ మారుతి.. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ప్రస్తుతానికైతే "రాజా డీలక్స్" అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఇది మారుతి శైలిలో కామెడీ మరియు హారర్ కలబోసిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ అని టాక్. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ 200 కోట్లు బడ్జెట్ అనే విధంగా మారిపోయిన తరుణంలో.. 'రాజా డీలక్స్' చిత్రాన్ని వీలైనంత తక్కువ బడ్జెట్ లో.. చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన సెట్ల నిర్మాణం చేపడుతున్నారు. హారర్ కామెడీ నేపథ్యానికి తగ్గట్టుగా ఓ పెద్ద ప్యాలెస్ ను నిర్మిస్తున్నారట. దీని కోసం దాదాపు ₹ 5 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. సినిమా సగానికి పైగా షూటింగ్ ఈ ఇంట్లోనే జరుగుతుందట.

అందుకే ఏదొక పెద్ద గెస్ట్ హౌస్ ను అద్దెకు తీసుకోకుండా.. భారీ సెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ముందుగానే అన్నీ పగడ్బంధీగా ప్లాన్ చేసుకుంటున్నారని అర్థం అవుతోంది.

ప్రస్తుతం గోపీచంద్ తో 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్న మారుతి.. వెంటనే ప్రభాస్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత మారుతి సినిమా సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఇందులో ముగ్గురు హీరోయిన్లకు చోటు ఉంటుందని.. వారిలో మాళవిక మోహనన్ ను మెయిన్ లీడ్ గా తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. మరో రెండు ఫీమేల్ లీడ్స్ కోసం ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ కు నేషనల్ వైడ్ ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. డార్లింగ్ తో సినిమా చేస్తున్నాడంటే దర్శకుడు మారుతీ జాక్ పాట్ కొట్టాడనే అనుకోవాలి. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.