Begin typing your search above and press return to search.

భీమ్లా కూడా... అమెజాన్ కు గట్టి దెబ్బ కొడుతున్న స్టార్‌ ఓటీటీ

By:  Tupaki Desk   |   4 March 2022 2:30 AM GMT
భీమ్లా కూడా... అమెజాన్ కు గట్టి దెబ్బ కొడుతున్న స్టార్‌ ఓటీటీ
X
ప్రస్తుతం ఓటీటీ ల మద్య విపరీతమైన పోటీ నెలకొంది. దాంతో నిర్మాతల పంట పండుతోంది. పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా మొన్నటి వరకు అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అయ్యేవి. వారు మాత్రమే భారీ మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే వారు. ఆ తర్వాత జీ 5 వారు కూడా భారీ మొత్తంలో సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. అమెజాన్ మరియు జీ 5 వారికి పోటీ అన్నట్లుగా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ దూకుడు పెంచింది.

ఇండియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కు చాలా కాలంగా మంచి బ్రాండ్‌ ఇమేజ్ ఉన్న విషయం తెల్సిందే. క్రికెట్‌ మ్యాచ్ లను మొదలుకుని ఎన్నో ఎంటర్‌ టైన్మెంట్‌ ఛానల్స్ ను మరియు టీవీ సీరియల్స్ ను అందిస్తున్న కారణంగా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కు ఇండియాలో అత్యధిక సబ్ స్క్రైబర్స్ ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు సినిమాల విషయంలో వారు వెనక పడటం తో అమెజాన్ టాప్‌ కు చేరే అవకాశాలు మెరుగయ్యాయి.

దాంతో డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు జాగ్రత్త పడ్డారు. అన్ని భాషల్లో కూడా పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు అనే తేడా లేకుండా క్రేజీ సినిమాలను కొనుగోలు చేస్తోంది. అందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు సిద్దం అయ్యింది. ఈమద్య కాలంలో తెలుగు లోనే వరుసగా సినిమాలను వీళ్లు కొనుగోలు చేస్తున్నారు. బాలయ్య నటించిన అఖండ సినిమా ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ముందుకు వచ్చినా అంతకు మించి ఇచ్చేందుకు డిస్నీ వారు ముందుకు రావడంతో అఖండ సినిమా డిస్నీ వారికే దక్కింది.

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో అఖండ తర్వాత మరిన్ని కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇటీవలే తమిళ స్టార్‌ హీరో నటించిన మారన్ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించిన డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ పలు తెలుగు సినిమాలను కూడా దక్కించుకునేందుకు గాను చర్యలు చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ ను కూడా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

భీమ్లా నాయక్‌ సినిమా ను అమెజాన్ ప్రైమ్‌ లేదా జీ 5 కొనుగోలు చేస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగిందని అంటున్నారు. అతి త్వరలోనే స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అకవాశాలు ఉన్నాయి. నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‌ చేసేలా ఒప్పందం చేసుకున్నారట.

అఖండ సినిమా వల్ల డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కు అత్యధిక లాగిన్స్ వచ్చాయని అంటున్నారు. ఇదే సమయంలో బిగ్‌ బాస్ నాన్ స్టాప్ మరియు క్రికెట్‌ వల్ల మరింతగా ఈ ఓటీటీ కి మంచి ఆధరణ ఉంది. కనుక భీమ్లా నాయక్ ను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి సినిమా చేరువ అయ్యే అవకాశాలు ఉందని మేకర్స్ మరియు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారట.