Begin typing your search above and press return to search.

కండోమ్‌ ప్రమోషన్ లో స్టార్‌ కపుల్‌

By:  Tupaki Desk   |   12 April 2022 9:30 AM GMT
కండోమ్‌ ప్రమోషన్ లో స్టార్‌ కపుల్‌
X
ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన 'నువ్వు నేను' సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన అనిత ఆ తర్వాత తెలుగు లో చాలా సినిమాల్లో నటించింది. మొదటి సినిమా తోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంది. సినిమాల్లోనే కాకుండా బుల్లి తెరపై కూడా ఈ అమ్మడి జోరు ఓ రేంజ్ లో సాగింది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా స్టార్‌ డమ్‌ దక్కించుకోలేక పోయినా కూడా హిందీ సీరియల్స్ మరియు టీవీ షో లతో స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంది. భారీ పారితోషికం తో ఎన్నో సిరీస్ లు సీరియల్స్ ల్లో నటించిన ఈమె తాజాగా పెళ్లి అయ్యి.. తల్లిగా మారడం తో కాస్త వెండి తెర మరియు బుల్లి తెరకు దూరంగా ఉంటుంది. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్‌ గా కొనసాగుతూ అందరిని ఎంటర్ టైన్ చేస్తోంది.

అందాల అనిత తన కొడుకు మరియు భర్తతో ఉన్న ఫోటోలను మరియు వీడియో లను రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ వస్తుంది. అప్పుడప్పుడు ఇతర బ్రాండ్స్ కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ ప్రమోటర్ గా వ్యవహరించి ఆదాయం ను దక్కించుకుంటుంది. తాజాగా కండోమ్‌ ప్రమోషన్ యాడ్‌ ను షేర్‌ చేయడం ద్వారా భారీ పారితోషికంను ఈ అమ్మడు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

కేవలం కండోమ్‌ యాడ్ ను తన ఇన్ స్టా లో షేర్‌ చేయడం మాత్రమే కాకుండా తన భర్తతో కలిసి ఆ కండోమ్‌ గురించి మాట్లాడటం మరియు ఆ కండోమ్‌ యొక్క పని తీరు గురించి కూడా ఆడవారికి వివరించి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. భర్తతో కలిసి ఈమె చేసిన కండోమ్‌ ప్రమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

హీరోయిన్ గా అందాల ఆరబోత చేసిన అనిత ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో షేర్‌ చేయడం ను చాలా మంది సమర్థిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం డబ్బు కోసం ఇలాంటి యాడ్స్ ను చేయడం అవసరమా అంటున్నారు. అయితే ఆల్కాహాల్‌ ను ప్రమోట్‌ చేసే వారి కంటే ఇది తప్పుడు పని కాదు అనేది కొందరి అభిప్రాయం.