Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ రిపోర్ట్ : అన్నీ మునిగినట్

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:44 AM GMT
ఓవర్సీస్ రిపోర్ట్ : అన్నీ మునిగినట్
X
ఐదు సినిమాలు కాబట్టి కనీసం అందులో రెండో మూడో బ్రహ్మాండమైన టాక్ తెచ్చుకుంటే చాలు డొమెస్టిక్ రన్ తో పాటు ఓవర్సీస్ లో సైతం కలెక్షన్లు అదరగొట్టొచ్చు అనే నిర్మాతల అంచనాలు పూర్తిగా నీరుగారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బహుశా ఇలాంటి శుక్రవారం ఈ ఏడాదిలో చూడలేదన్న మాటలో నిజం లేకపోలేదు. షారుఖ్ ఖాన్ జీరో యునానిమస్ గా డిజాస్టర్ కాగా ఇప్పటిదాకా గ్రాస్ రూపంలో 1 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. ఆదివారం సెలవే అయినప్పటికీ మొదటిరోజు వచ్చిన $350K కంటే నిన్న వచ్చిన $270K తక్కువ కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే జీరో యుఎస్ లో బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం ఖరారైనట్టే.

ఇక అంతరిక్షం నడక నీరసంగా ఉంది. గురువవారం ప్రీమియర్ల నుంచి 91 వేల డాలర్లు రాబట్టిన శుక్రవారానికి 63 వేల డాలర్లు శనివారానికి 77 వేల డాలర్లు రాబట్టుకుంది. ఆదివారం షాక్ కలిగించే రీతిలో కేవలం 42 వేల డాలర్లు మాత్రమే వచ్చాయని సమాచారం. మొత్తం ఇప్పటిదాకా వచ్చింది 275 వేల డాలర్లు మాత్రమే. రెండున్నర కోట్ల దాకా నష్టం తప్పేలా లేదు ఇక పడి పడి లేచే మనసు మొదటిరోజే స్లోగా 75 వేల డాలర్లతో స్టార్ట్ అయ్యింది. కానీ తర్వాత వరసగా 44 వేలు-50 వేలు-30 వేల డాలర్ల డౌన్ ట్రెండ్ వసూళ్లతో 200 వేల డాలర్లతో అంతరిక్షం కన్నా వెనుకబడి పోయింది. దాన్ని మించి 3 కోట్ల దాకా నష్టం మిగిల్చడం ఖాయమని అక్కడి రిపోర్ట్.

ఇక కెజిఎఫ్ కొంత మెరుగ్గా ఉంది కానీ మరీ అద్భుతాలు చేయడం లేదు. కన్నడ సినిమా స్థాయికి ఇదే ఎక్కువ కాబట్టి యావరేజ్ కన్నా ఓ మెట్టుపైన దీన్ని పరిగణిస్తున్నారు. గురువారం ప్రీమియర్లతో 62 వేల డాలర్లతో మొదలుపెట్టిన కెజిఎఫ్ వరసగా 59 వేలు-102 వేలు-80 వేల డాలర్లతో ఆదివారం క్లోజ్ అయ్యే నాటికి 300 వేల డాలర్ల తో బెటర్ పొజిషన్ లో ఉంది. అంత మాత్రాన ఇది హిట్ అని చెప్పలేం కానీ మిగిలినవాటితో పోలిస్తే కాస్త బెటర్ అనిపిస్తోంది అంతే. మొత్తానికి దేనికీ పాజిటివ్ టాక్ రాకుండా డిసెంబర్ 21 ఓవర్సీస్ ని దాదాపు ముంచేసినట్టే