Begin typing your search above and press return to search.

నీ ఇల్లు బంగారం గాను… నా ఒళ్ళు సింగారం గాను!!

By:  Tupaki Desk   |   26 March 2022 11:30 PM GMT
నీ ఇల్లు బంగారం గాను… నా ఒళ్ళు సింగారం గాను!!
X
ఎన్టీఆర్ గ‌జ‌దొంగ (1981) చిత్రంలోనిది ఈ లిరిక్. వేటూరి సుంద‌ర‌రామ మూర్తి సాహిత్యం అందించ‌గా చ‌క్ర‌వ‌ర్తి.కె సంగీతం అందించారు. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీబాలు - జాన‌కి ఆల‌పించారు. ఈ క్లాసిక్ సాంగ్ కి రిజంబ్లెన్స్ క‌నిపిస్తోంది జాన్వీ మేని విరుపుల్లో. జాన్వీ రూపం అలా క్లాసిక్ ని త‌ల‌పిస్తూ యూత్ కి మ‌తులు చెడ‌గొడుతోంది.

మెరుపులు విరుపుల‌తో మెరిసిపోతున్న జాన్వీ క‌పూర్ న‌యా లుక్ యూత్ లోకి దూసుకుపోయింది. ఇటీవ‌ల వ‌రుస‌గా బికినీల‌తో షేక్ చేసిన జాన్వీ ఇప్పుడిలా ప్ర‌యోగాత్మ‌క లుక్ తోనూ మెరిపిస్తోంది. సంథింగ్ స్పెష‌ల్ డిజైన‌ర్ టాప్ తో అద‌ర‌గొట్టింది. జాన్వీలో హాట్ కంటెంట్ ని ఈ డిజైన్ స‌రికొత్త‌గా ఆవిష్క‌రించింద‌ని చెప్పాలి. దోస్తానా 2 .. గుడ్ ల‌క్ జెర్రీ స‌హా ప‌లు చిత్రాల్లో జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఇవ‌న్నీ మునుముందు విడుద‌ల‌కు సిద్ధం కావాల్సి ఉంది.

బోయ్ ఫ్రెండ్ మాటేమిటీ?

జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నుంచి జాన్వీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. విభిన్న కాన్సెప్టులు ఎంచుకుని వైవిధ్య‌మైన‌ సినిమాలు చేసే జాన్వీ ప్రేమ‌లో ఉంద‌ని కూడా ఇంత‌కుముందు టాక్ వినిపించింది. తన ఒంటిపై టాటూలలో ఒకటి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో తన వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం ప‌రంగానూ ముఖ్యాంశాలలో నిలిచింది జాన్వి. ఇంత‌కుముందు రిషికేశ్ వెకేషన్ కి వెళ్లిన జాన్వీ ఒంటిపై ఒక సీక్రెట్ టాటూ మెర‌వ‌డంతో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

తన అభిమానుల కు హింట్ ఇస్తూ.. జాన్వీ టాటూ వేసుకుని తన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో జాన్వి తన ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. ఇది మాత్రమే కాదు.. జాన్వీ ముఖంలో చాలా భయం కూడా కనిపించింది. ఈ టాటూ చూసిన అభిమానులు ఈ లబ్బు ఎవరా అని గుస‌గుస‌గా చ‌ర్చించుకున్నారు.

జాన్వీ తన తల్లిని శ్రీదేవి లబ్బు అని పిలిచేది. అంటే తన తల్లి జ్ఞాపకార్థం నటి తన చేతిపై ఈ క్యూట్ టాటూ వేయించుకుంద‌ని కూడా కొంద‌రు భావించారు. ఈ పచ్చబొట్టు జాన్వీ అభిమానులలో వైర‌ల్ అయ్యింది.

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవ‌ల వ‌రుస‌ పోస్ట్ లను షేర్ చేస్తూ తన అభిమానులతో కనెక్ట్ అవుతూ ఉంది ఈ బ్యూటీ.