Begin typing your search above and press return to search.

2019ని వేడెక్కిస్తున్న దిల్ రాజు

By:  Tupaki Desk   |   31 Jan 2019 7:18 AM GMT
2019ని వేడెక్కిస్తున్న దిల్ రాజు
X
త్రిష‌- విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన 96 త‌మిళ‌నాడులో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 2018 అక్టోబ‌ర్ లో రిలీజైన ఈ చిత్రం శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. అటుపై ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌లో రీమేక్ చేసేందుకు ప‌లువురు అగ్ర నిర్మాత‌లు పోటీప‌డ్డారు. ఈ పోటీలోనే తెలుగు వెర్ష‌న్ రీమేక్ హ‌క్కుల్ని దిల్ రాజు చేజిక్కించుకున్నారు. ఒరిజిన‌ల్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సి.ప్రేమ్ కుమార్ తెలుగు వెర్ష‌న్ కోసం ఎంపిక‌య్యారు. ఆయ‌న ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నుల్ని చేస్తున్నారు. మాతృక‌లో త్రిష జాను అనే పాత్ర‌లో న‌టించ‌గా, విజ‌య్ సేతుప‌తి రాము అనే పాత్ర‌లో న‌టించాడు. స్కూల్ డేస్ లోనే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క్ర‌ష్.. ఆ త‌ర్వాత విడిపోయాక‌.. తిరిగి క‌లుసుకున్నాక‌.. రెండు ప్యార‌ల‌ల్ స్టోరీస్ ని ప్రెజెంట్ లో, ఫాస్ట్ ఫార్వార్డ్ లో అద్భుత స్క్రీన్ ప్లేతో రూపొందించారు ప్రేమ్ కుమార్. అయితే తెలుగులో అదే స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని అనుస‌రించే అవ‌కాశం ఉందిట‌.

ఇంత‌కీ ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఎప్పుడు? అన్న‌దానికి దిల్ రాజు స్వ‌యంగా క్లారిటీనిచ్చారు. ఇప్ప‌టికే శ‌ర్వానంద్ - స‌మంత జంట‌ను దిల్ రాజు ఫైన‌ల్ చేసారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టే అవ‌స‌రం మేర స్క్రిప్టులో మార్పులు చేస్తున్నార‌ట‌. హైద‌రాబాద్ లో ఎఫ్ 2 స‌క్సెస్ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు స్వ‌యంగా ఈ సంగ‌తిని రివీల్ చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ- ``స‌మంత సినిమా చూడ‌కముందే 96 చూడ‌మ‌ని త‌న‌కు ఫోన్ చేశాను. ర‌క‌ర‌కాల రూమ‌ర్ల త‌ర్వాత‌ త‌ను సినిమా చేయ‌బోన‌ని ట్వీట్ చేసింది. త‌న‌కు ఏ క్లారిటీ లేకుండానే ఆ ట్వీట్ చేసింది. అయితే ఆ త‌ర్వాత నేను త‌నతో మాట్లాడాను. ఈ సినిమా ఎలా చేస్తున్నాం? హీరో ఎవ‌రు? ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అనేది ఫోన్ లోనే త‌న‌కు చెప్పాను. ఆ త‌ర్వాత తెలుగులో ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది త‌న‌తో మాట్లాడాను`` అని తెలిపారు.

త‌మిళ వెర్ష‌న్ సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందే చూశాను. తెలుగులోనూ ఇది సూప‌ర్ హిట్ అవుతుంది. తొలిసారి నేను ఓ రీమేక్ చేస్తున్నాను. మంచి ఆర్టిస్టులు కావాలి అనుకోగానే స‌మంత‌- శ‌ర్వానంద్ ల‌ను ఇవ్వ‌మ‌ని ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్ అడిగాడు. త‌మిళ్ లో ఎలా ఉందో తెలుగులోనూ అలా తీస్తాన‌ని అన్నారు. 96 సినిమా త‌మిళంలో క్లాసిక్ చిత్రం. తెలుగులో అలా క్లాసిక్ అవుతుందా లేదా అన్న‌ది రిలీజ్ త‌ర్వాత స్క్రీన్ పై చూశాకే చెబుతాను. సినిమా ప్రివ్యూ చూసిన వెంట‌నే ద‌ర్శ‌కనిర్మాత‌ల్ని పిలిచి వెంట‌నే అక్క‌డే క‌మిట్ చేసేశాన‌ని అన్నారు. 2019లో దిల్ రాజు మ‌రిన్ని ప్రాజెక్టుల‌తో వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మ‌హేష్ 25వ చిత్రం మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. ఏప్రిల్ 25 న ఈ సినిమా రిలీజ‌వుతుంది. దీంతో పాటే పలువురు ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించారు. వాటిని ఫైన‌ల్ చేయాల్సి ఉందిట‌. ప్ర‌స్తుతం ఎఫ్ 2 ఘ‌న‌విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నామ‌ని తెలిపారు.