Begin typing your search above and press return to search.

`పుష్ప‌`లో విల‌న్ అత‌ను కాదా? మ‌రెవ‌రంటే?

By:  Tupaki Desk   |   12 Oct 2021 1:30 AM GMT
`పుష్ప‌`లో విల‌న్ అత‌ను కాదా? మ‌రెవ‌రంటే?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ఫ‌ ది రైజ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి బ‌న్నీ పాన్ ఇండియా రేంజ్ లో ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేస్తున్నాయి. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో విల‌న్ గా మ‌ల‌యాళం న‌టుడు ఫ‌హద్ ఫాజిల్ న‌టిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఆయ‌న మెయిన్ విల‌న్ అని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ విష‌యం తెలిస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు. `పుష్ప‌`లో మెయిన్ విల‌న్ సునీల్ అని టాక్ వినిపిస్తోంది.

బ‌న్నీ-సునీల్ మ‌ద్య కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండ‌బోతున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఫ‌హిద్ పాజిల్ ప్ర‌థమార్థం ఎండింగ్ లో.. ఆ త‌ర్వాత ద్వితియార్థంలో పుల్ లెంగ్త్ రోల్ లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అంటే సునీల్ పాత్ర‌..ప‌హిద్ పాత్ర సినిమాలో అత్యంత కీల‌క‌మ‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే సునీల్ కెరీర్ లో ఓ ట‌ర్నింగ్ మూవీగా చెప్పొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కూ సునీల్ క‌మెడియ‌న్ గా...విల‌న్ గా మాత్ర‌మే న‌టించాడు. నెగిటివ్ షెడ్ ఉన్న పాత్ర‌లు పోషించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఏకంగా పాన్ ఇండియా చిత్రంలోనే మెయిన్ విల‌న్ గా క‌నిపిచ‌డం థ్రిల్లింగ్ అనే చెప్పాలి.

ఇక హీరోయిన్ గా న‌టిస్తోన్న ర‌ష్మిక మంద‌న్న గ్లామ‌ర్ డోస్ కూడా పెంచినట్లు స‌మాచారం. మునుపెన్న‌డు చూడ‌ని కొత్త ర‌ష్మిక‌ని చూస్తామ‌ని ఇప్ప‌టికే ఆమె లుక్ రివీల్ ని బ‌ట్టే తెలుస్తోంది. ఇందులో ఆమె గిరిజన‌ యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. క‌ట్టుబొట్టు అచ్చంట ట్రైబ‌ల్ గాళ్ ఆహార్యంలో ఒదిగిపోయింద‌ని ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబ‌ల్ మ‌హిళ‌లు స‌హ‌జంగానే జాకెట్ ధ‌రించ‌రు. కేవ‌లం చీర‌తోనే టాప్ టూ బాట‌మ్ ని క‌వ‌ర్ చేస్తారు. ఈ నేప‌థ్యంలోనే ర‌ష్మిక పాత్ర‌ను మ‌రింత గ్లామ‌ర్ డోస్ పెంచి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.