Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ తో ఇలాంటి చిత్రం వర్కవుట్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   3 Aug 2021 6:30 AM GMT
అల్లు అర్జున్ తో ఇలాంటి చిత్రం వర్కవుట్ అయ్యేనా?
X
వరుస విజయాలతో జోరుమీదున్నారు దర్శకుడు మారుతి. చిన్న సినిమాలతో తన ప్రస్థానం ప్రారంభించిన మారుతి , విక్టరీ వెంకటేష్, నాచురల్ స్టార్ నాని, శర్వానంద్ లాంటి హీరోలతో కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన 'మంచి రోజులొచ్చాయి' తెరకెక్కించడంలో నిమగ్నమయ్యారు. సంతోష్ శోభన్ ,మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు .

మారుతి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిందే. అల్లు అర్జున్ తో ఎలాంటి సినిమా రూపొందించాలనుకుంటున్నారు అన్న ప్రశ్న కు, యానిమేషన్ చిత్రం అని మారుతి సమాధానం ఇచ్చారు. అల్లావుద్దీన్ లాంటి యానిమేషన్ చిత్రం చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు.

తనకి, అల్లు అర్జున్ కి ఇద్దరికీ యానిమేషన్ చిత్రాలంటే ఇష్టమని, ఇలాంటి చిత్రం చేయాలనీ ఎప్పటి నుంచో ఉందని మారుతి అన్నారు. అల్లు అర్జున్ అద్భుతంగా చిత్రాలు గీయగలరని కూడా మారుతి చెప్పారు.

అంతా బాగానే ఉంది కానీ, యానిమేషన్ చిత్రం అది కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ తో రూపొందిస్తితే, ఎంత వరకూ ప్రేక్షకులని మెప్పించగలదు అనేది ప్రశ్న. ఈ మధ్య కాలంలో భారతదేశంలో పెద్ద యానిమేషన్ చియాత్రలు దాదాపు రాలేదనే చెప్పాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ విక్రమసింహ ఇలాంటి ప్రయత్నమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప లో నటిస్తున్నారు. సుకుమార్ తెరకెక్కేంచే ఈ పాన్ ఇండియా చిత్రం, ఐదు భారతీయ భాషల్లో విడుదలవ్వబోతోంది వరుస విజయాలతో జోరు మీదున్న రష్మిక మందన్నా, పుష్పలో కథానాయికగా నటిస్తోంది.