Begin typing your search above and press return to search.

ఓపీ న‌య్య‌ర్ తో ల‌తా మంగేష్క‌ర్ వివాదం!

By:  Tupaki Desk   |   7 Feb 2022 3:44 AM GMT
ఓపీ న‌య్య‌ర్ తో ల‌తా మంగేష్క‌ర్ వివాదం!
X
గాన కోకిల లతా మంగేష్క‌ర్ తో ఒక్క పాటైనా పాడించుకోవాల‌ని ఎంతో మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు క్యూలో ఉండేవారు. సినిమాలో చిన్న లైన్ పాడినా ఆ సినిమాకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు గా భావించేవారు. అయితే అంత‌టి లెజెండ‌రీ సింగ‌ర్ కి అవ‌కాశం క‌ల్పించ‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే?... ఉన్నార‌నే తెలుస్తోంది. గాన కోకిల రాజ్య‌మేలుతోన్న స‌మ‌యంలో ఓ.పీ న‌య్య‌ర్ అనే సంగీత ద‌ర్శ‌కులు ల‌తాజీతో ఒక్క పాట కూడా పాడించ‌లేదు. ఒక‌రికి ఒక‌రు బాగా ప‌రిచ‌య‌స్తులే. కానీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో పంతం ఆ కాంబినేష‌న్ ని క‌ల‌ప‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య అంత‌టి వైరం ఏముంద‌న్న‌ది అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా న‌లిగింది.

దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలు తెర‌పైకి వ‌చ్చాయి. `ఆస్మాన్` సినిమాతో ఓపీ న‌య్య‌ర్ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత `ఆర్ పార్` సినిమా వ‌చ్చింది. అది పెద్ద హిట్ అవ్వ‌డంతో న‌య్య‌ర్ కి వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఓపీ ప్ర‌భావం కాల‌క్ర‌మేణా ఎంత‌గా చూపిందంటే అప్ప‌టికే బుక్ చేసిన సంగీత ద‌ర్శ‌కుల్ని సైతం నిర్మాత‌లు తొల‌గించి న‌య్య‌ర్ ని లాక్ చేసేవారు. అలా `మెహ‌బూబా` సినిమా నిర్మాత అమ‌ర్ నాథ్ కూడా రోష‌న్ ని తొల‌గించి న‌య్య‌ర్ ని తీసుకున్న వాళ్ల‌లో ఉన్నారు. అయితే అప్ప‌ట్లో ఆర్ధిక స్థితి స‌రిగ్గా లేక వేరే వారి అవ‌కాశాలు అందుకోవాల్సి వ‌చ్చింద‌ని న‌య్య‌ర్ చెప్పుకునేవారు.

అయితే రోష‌న్ ని తొల‌గించ‌డంపై ల‌తా మంగేష్క‌ర్ న‌య్య‌ర్ పై కోపం పెంచుకున్నార‌ని చెప్పుకునేవారు. ఆ సినిమాలో అప్ప‌టి రోష‌న్ ఉండ‌గా ఓ పాట కూడా పాడారు ల‌తాజీ. న‌య్య‌ర్ కి అవ‌కాశం ఇస్తే పాడ‌న‌ని ప‌బ్లిక్ గానే చెప్పారామె. ల‌త అలా అనేస‌రికి న‌య్య‌ర్ కోపగించుకున్నారు. దానికి కౌంట‌ర్ గా న‌య్య‌ర్ అస‌లు ల‌త‌ని త‌న సినిమాలో పాడ‌నివ్వ‌న‌ని స్టేట్ మెంట్ ఇచ్చారు. అలా ఇద్ద‌రి మ‌ద్య వివాదం చినిగి చినిగి గాలి వాన‌లా మారిందని అప్ప‌ట్లో చెప్పుకునేవారు.

ఈ వివాదాన్ని మ్యూజిక్ అసోసియేష‌న్ లో ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించ‌లేదు. అప్ప‌టి అసోసియేస్ అధ్య‌క్షుడు అనిల్ బిశ్వాస్ న‌య్య‌ర్ సినిమాలో ఎవ‌రూ పాడ‌కూడ‌ద‌ని ఆదేశాలిచ్చారు. దీంతో న‌య్య‌ర్ కి ఏం చేయాలో పాలు పోలేదు. ఆ త‌ర్వాత మ‌రో గాయ‌ని షంషాద్ బేగం వ‌ద్ద‌కు వెళ్లి స‌మ‌స్య‌ని చెప్పుకున్నారు. ఆమె భ‌రోసా ఇవ్వ‌డంతో న‌య్య‌ర్ ఊపిరి తీసుకున్నారు.

సినిమాలో ఎన్ని పాట‌లు పాడ‌మంటే అన్ని పాడ‌త‌న‌ని హామీ ఇచ్చారు. ఆ క్ష‌ణ‌మే న‌య్య‌ర్ జీవితంలో ల‌తా మంగేష్క‌ర్ తో పాట‌లు పాడించ‌కూడ‌ద‌ని న‌య్య‌ర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పుకునేవారు. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ల‌తా పేరిట నెల‌కొల్పిన అవార్డును న‌య్య‌ర్ ఇవ్వాల‌నుకుంది. ఆ అవార్డును న‌య్య‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా తిర‌స్క‌రించారు. `గీతా ద‌ళ్` అవార్డు అని పేరు మార్చి ఇస్తే తీసుకుంటాన‌ని అన్నారు. అలా ల‌తా మంగేష్క‌ర్-ఓపీ న‌య్య‌ర్ మ‌ధ్య జీవితాంతం వార్ న‌డిచింది.