Begin typing your search above and press return to search.

పాఠాలతో కాదు పాటలతో డాక్టరేట్

By:  Tupaki Desk   |   29 Sep 2017 4:23 AM GMT
పాఠాలతో కాదు పాటలతో డాక్టరేట్
X
ప్రతి మనిషికి ఎదో ఒక సమయంలో జీవితం గురించి సరైన అర్థం తెలుస్తోంది. జీవితంలో మొదటి గెలుపు ఎంతవరకు తీసుకెళుతుందో గాని మొదటి ఓటమి తప్పకుండా మనిషిని తారా స్థాయికి చేర్చుతుంది. ఓ గానకోకిల విషయంలో కూడా అదే జరిగింది. స్కూల్లో పాఠాలు నేర్వడానికి ఇష్టపడలేదు. కానీ ఆమె ఇప్పటివరకూ 30 వేల పాటలను పాడి ప్రపంచంలో ప్రముఖుల మన్ననలను అందుకుంది. గొప్పగా చదివిన వాళ్లకి కూడా అందని అవార్డులు ఆమె పాదాల దగ్గరకి చేరాయి.

ఆమె ఎవరో కాదు గాన కోకిలాగా బారతదేశమంత తన గొంతును వినిపించిన లతా మంగేష్కర్. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం గురించి కొన్ని విషయాలను వివరించింది. మొదట్లో ఆమె జీవితం అనేక మలుపులు తీరిగింది. మొదట ఆమె 13 ఏళ్ల వయసులో పాడిన పాట బాగాలేదని సినిమాలో నుంచి తొలగించారు. ఆమె గాత్రంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీంతో నిరాశ చెందకండా ఆ తర్వాత ప్రయత్నాలలో అందరినీ మెప్పించి. అతి కొద్ది కాలంలోనే టాప్ సింగర్ గా మారిపోయింది. సాధారణ కుటుంబంలో జన్మించిన లత గారు చదువుపై అంతగా ప్రతిభను కనబరచ లేకపోయారు. ఎందుకంటే ఆమె స్కూల్ దశలోనే చదువుకు ఎండ్ చెప్పారు.

ఆమె అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉందట. చిన్న కారణానికి స్కూల్లో ఆమెపై హెడ్ మాస్టర్ కోప్పడటంతో స్కూల్ కి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యారు. కెవలం తోటి స్నేహితులకు పాటలను ఎలా పాడాలో నేర్పుతుండగా ప్రధానోపాధ్యాయుడు వచ్చి 'ఆపుతావా?' అని గట్టిగా అరవడంతో లత గారికి కూడా కోపం వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత స్కూల్ కి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ ఆమె గాయనిగా మారిన తర్వాత ఆరు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీ పొందారు. అలాగే అనేక బిరుదులను కూడా లతా మంగేష్కర్ అందుకున్నారు.