Begin typing your search above and press return to search.

లాస్యకు అన్యాయం చేసేశారుగా రాజా

By:  Tupaki Desk   |   4 Feb 2017 6:20 AM GMT
లాస్యకు అన్యాయం చేసేశారుగా రాజా
X
చాలామంది టీవీ యాంకర్లు సినిమా రంగంలో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే.. ట్రయల్స్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ లో యాంకర్ లాస్య లాంఛింగ్ మూవీ అంటూ మొదటి నుంచి ప్రమోట్ చేస్తున్న చిత్రం 'రాజా మీరు కేక'.

ఇప్పుడీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో చాలానే ఎమోషన్స్ చూపించారు. ఫ్రెండ్స్ అంటూ ఓ గ్యాంగ్.. ఫ్యామిలీ అంటూ రిలేషన్స్.. లవ్ అంటూ ఓ కపుల్.. ఇలా రకరకాల వేరియేషన్స్ చూపించగా.. ప్రాబ్లెం అంటూ నందమూరి తారకరత్నను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే.. మొత్తం ట్రైలర్ లో లాస్య పట్టుమని నాలుగైదు ఫ్రేమ్స్ లో కూడా కనిపించలేదు. సింగిల్ గా చూపించిన ఒకే ఒక్క ఫ్రేమే ఒక్క సెకన్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా గుంపులో గోవిందా బాపతే. లాస్య లాంఛింగ్ మూవీ అనే పాయంట్ ని ప్రమోషన్స్ కోసమేనా అనిపించకమానదు.

ఈ ట్రైలర్ ద్వారా తారకరత్నకు ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో కానీ.. లాస్యకు మాత్రం దక్కేదేమీ లేదు. చూద్దాం.. సినిమాలో అయినా.. లాస్యకు ఏమైనా స్కోప్ ఉంటుందేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/