Begin typing your search above and press return to search.

అమ్మడికి లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌ ఛాన్స్‌

By:  Tupaki Desk   |   17 Dec 2019 4:52 AM GMT
అమ్మడికి లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌ ఛాన్స్‌
X
టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సౌత్‌ ఇండియా సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఇలియానా. సౌత్‌ లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న ముద్దుగుమ్మగా ఇలియానా నిలిచింది. సౌత్‌ లో ఫుల్‌ ఫామ్‌ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ కు వెళ్లి పోయిన ఈ అమ్మడికి అక్కడ రెండు మూడు సంవత్సరాలు బాగానే గడిచింది. కాని ఆ తర్వాత కష్టకాలం ప్రారంభం అయ్యింది. ఇక బాలీవుడ్‌ లో నెగ్గుకు రావడం సాధ్యం కాదని నిర్ణయించుకుని మళ్లీ సౌత్‌ కు వచ్చే ప్రయత్నాలు చేసింది.

సౌత్‌ ఆడియన్స్‌ మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమెపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. రవితేజ మాత్రం ఈమెకు అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాతో ఛాన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా ఇలియానాకు నిరాశ పర్చింది. దానికి తోడు ఆ సినిమాలోని ఆమె లుక్‌ పై విమర్శలు వచ్చాయి. దాంతో తెలుగులో ఆమె కెరీర్‌ దాదాపుగా ఖతం అయినట్లే అనుకుంటున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఇలియానాకు మళ్లీ ఆఫర్లు రావడం కష్టమే అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఈమెకు ఛాన్స్‌ ఇచ్చాడు.

అజిత్‌ ఏ సినిమా చేసినా కూడా హీరోయిన్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. సీనియర్‌ హీరోయిన్స్‌ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే సీనియర్‌ హీరోయిన్స్‌ అందరితోనూ కానిచేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి ఇలియానాపై పడ్డట్లుగా సమాచారం అందుతోంది. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న అజిత్‌ మూవీకి ఇలియానా హీరోయిన్‌ గా దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

అజిత్‌ తో సినిమా ఆఫర్‌ రావడంతో ఈ అమ్మడు బరువు తగ్గేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే బరువు తగ్గింది. మరింతగా బరువు తగ్గి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సినిమా ఇలియానాకు లాస్ట్‌ ఛాన్స్‌ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫలితం పాజిటివ్‌ అయితే మరికొంత కాలం ఇండస్ట్రీలో ఉంటుంది. లేదు అంటే ఇలియానాకు ప్రేక్షకులు పూర్తిగా గుడ్‌ బై చెప్పడం కన్ఫర్మ్‌ అంటున్నారు.