Begin typing your search above and press return to search.

మెగా కుర్రాడికి లైన్ వేస్తోందా ఫారిన్ పాప?

By:  Tupaki Desk   |   19 July 2016 9:30 AM GMT
మెగా కుర్రాడికి లైన్ వేస్తోందా ఫారిన్ పాప?
X
ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు సోషల్ సైట్లలో స్పందించే తీరు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడైతే అసలు తెలుగు బాష సరిగ్గా తెలియని భామలు కూడా తమ ట్వీట్లతో పిచ్చెత్తిస్తున్నారు. అదిగో బ్రెజిల్ భామ లరిస్సా బొనేసి ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్ ఫ్యాన్సుకు ఇలాగా షాకిస్తోంది.

'తిక్క' సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు సాయిధరమ్‌ అండ్‌ లరిస్సా. అయితే ఇప్పుడు షూటింగ్‌ పూర్తయిపోవడంతో.. ''ఐ మిస్‌ యు.. సాయిధరమ్.. వెన్నెల కిషోర్'' అంటూ ట్వీటేసింది అ అమ్మడు. దానికి రెస్పాన్సుగా సాయిధరమ్‌ ''ఒకె'' అని జవాబు చెప్పాడు. దానితో విస్తుపోయిన ఈ బ్రెజిల్ భామ.. ''ఎన్నిసార్లు ఇలా ఓకె అని చెబుతావ్‌? అరే పాగల్.. చుప్‌'' అంటూ ప్రేమగా తిడుతోంది. చూస్తుంటే ఈ హాట్‌ బంగారం సాయిధరమ్‌ కు లైనేస్తోందేమో అనిపించట్లేదు?

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ''తిక్క'' ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 13న సినిమా రిలీజ్ చెయ్యడానికి చాలా సన్నాహాలే చేస్తున్నారు. తమన్‌ బాబు ఇప్పటికే రీ-రికార్డింగ్‌ పనులు ఇరగదీస్తున్నాడట.