Begin typing your search above and press return to search.

పింక్ బ్రాతో హొయ‌లు పోయిన `తిక్క` పిల్ల‌

By:  Tupaki Desk   |   25 April 2021 4:41 AM GMT
పింక్ బ్రాతో హొయ‌లు పోయిన `తిక్క` పిల్ల‌
X
స‌న్న‌జాజి తీగ‌లా మెరుపులా మైమ‌రిపించే బ్రెజిలియ‌న్ మోడ‌ల్ లారిస్సా బోనెసి. ప్ర‌స్తుతం పెద్ద‌తెర‌పైనా వెలుగుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ నాయిక‌గా సుప‌రిచితం.

అక్షయ్ కుమార్ - జాన్ అబ్రహం నటించిన రొమాంటిక్ కామెడీ దేశీ బోయ్జ్ నుండి `సుభా హోన్ నా దే` అనే పాపుల‌ర్ సాంగ్ లో డాన్సర్ గా కనిపించడం ద్వారా ఆమె తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ నటించిన గో గోవా గాన్ లో సహాయక పాత్రలో నటించింది. ఇది గోవాలో ఒక రేవ్ పార్టీకి హాజరైన స్నేహితుల బృందం చుట్టూ తిరుగుతుంది. మరుసటి రోజు ఉదయం జాంబీస్ మధ్య చిక్కుకున్న విష‌యం తెలిశాక ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా క‌థాంశం.

ఆ తర్వాత సునీల్ రెడ్డి దర్శకత్వంలో 2016 తెలుగు యాక్షన్ కామెడీ తిక్కలో సాయి ధరం తేజ్ సరసన లారిస్సా కథానాయికగా నటించింది. ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకున్నప్పటికీ సాయి ధరం తేజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి. లారిస్సా అంద‌చందాల‌కు యూత్ ఫిదా అయ్యారు. ఈ చిత్రం హిందీలో రాకెట్ రాజా పేరుతో డబ్ అయ్యి ఇప్ప‌టికీ అల‌రిస్తోంది.

ఈ నటి తన మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సుబా హోన్ నా దే తో ఆక‌ట్టుకుంది. అలాగే సూపర్ స్టార్స్ జాన్ అబ్రహం -అక్షయ్ కుమార్ లతో లారెస్సీ ఇంత‌కుముందు న‌టించింది. ఎస్ ఆర్ నో.. ఆర్ యు కమింగ్ లాంటి మరికొన్ని హిట్ మ్యూజిక్ వీడియోల‌లోనూ క‌నిపించారు. మ‌రోవైపు లారిస్సా హిందీ చిత్ర‌సీమ‌లోనూ త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలిసింది.

వీట‌న్నిటినీ మించి లారిస్సా సోష‌ల్ మీడియా యాక్టివిటీస్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. నిరంత‌రం ఈ వేదిక‌పై వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది ఈ బ్యూటీ. వీకెండ్ వైబ్స్ అంటూ లారిస్సా పింక్ ఇన్న‌ర్ (బ్రా)లో ప్ర‌త్య‌క్ష‌మై ఒక్క‌సారిగా అగ్గి రాజేసింది. లారిస్సా హాట్ నెస్ లోడెడ్ అంటూ యూత్ ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.

మ‌రోవైపు లారిస్సా డ‌జ‌ను బ్రాండ్ల‌కు ప్ర‌మోట‌ర్. ప్ర‌ఖ్యాత బ్రాండ్లు ఓలే.. లాంకోమ్ .. లోట్టోస్ స్పోర్ట్ వంటి బ్రాండ్ లకు మోడల్ గా భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుని ఆర్జిస్తోంది. ఎలిగాన్స్ ప్రోస్పెరిట్.. కన్వర్స్.. నైన్ వెస్ట్ .. లెవిస్ బ్రాండ్లు ఈ అమ్మ‌డి ఖాతాలో ఉన్నాయి.