Begin typing your search above and press return to search.

#సండే వైబ్స్.. ఆర‌బోత‌కు సెన్సార్ చిక్కులు!

By:  Tupaki Desk   |   11 April 2021 11:30 PM GMT
#సండే వైబ్స్.. ఆర‌బోత‌కు సెన్సార్ చిక్కులు!
X
అవును.. అందం సెన్సార్డ్..! ఆ గ‌మ్మ‌త్త‌యిన‌ అందాల‌కు క‌త్తెర‌ వేసేసారు..!! అదెట్టా? అంటే ఇదిగో ఇక్క‌డ ఈ ఫోటోని గ‌మ‌నిస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. సెన్సార్డ్ అంటూ త‌న‌కు తానుగానే ఇలా ప‌బ్లిసిటీకి రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ‌ను ఎక్క‌డో చూసిన‌ట్టే ఉంది క‌దూ?

నిజ‌మే.. ఈ బ్యూటీ సాయి తేజ్ స‌ర‌స‌న తిక్క చిత్రంలో న‌టించింది. పేరు లారిస్సా బోనెస్సి. తిక్క‌ సినిమాలో త‌న‌దైన అందంతో గుబులు రేపిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత ఎందుక‌నో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో స‌రైన అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ప్ర‌యివేట్ ఆల్బ‌మ్స్ వెబ్ సిరీస్ లు అంటూ కెరీర్ ప‌రంగా డిఫ‌రెంట్ గానే వెళుతోంది.

బ్రెజిలియ‌న్ మోడ‌ల్ లారెస్సా మోడ‌లింగ్ తో పాటు స్పెష‌ల్ వీడియో ఆల్బ‌మ్స్ తోనూ అభిమానుల్ని అల‌రించేందుకు రెడీ అవుతోంది. ఇటీవ‌ల హోలీ రంగోలి హోలీ .. అంటూ సాగే మ్యూజిక్ వీడియోలో అరాధ్య మాన్ ‌తో పాటు లారిస్సా బోనెసీ న‌టించింది. ఇక ఈ భామ నిరంత‌ర ఇన్ స్టా ఫోటో ట్రీట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. తాజాగా సెన్సార్డ్ అంటూ బోల్డ్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా దానిని యూత్ వైర‌ల్ చేస్తున్నారు.

లారిస్సా బోనెసి గో గోవా గాన్ చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకేనే ఈ భామను తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ నటి తన మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సుబా హోన్ నా దే తో ఆక‌ట్టుకుంది. అలాగే సూపర్ స్టార్స్ జాన్ అబ్రహం -అక్షయ్ కుమార్ లతో లారెస్సీ ఇంత‌కుముందు న‌టించింది. ఎస్ ఆర్ నో.. ఆర్ యు కమింగ్ లాంటి మరికొన్ని హిట్ మ్యూజిక్ వీడియోల‌లోనూ క‌నిపించారు.