Begin typing your search above and press return to search.

సినిమా పెద్దలకు చవగ్గా భూములు??

By:  Tupaki Desk   |   14 July 2016 5:35 AM GMT
సినిమా పెద్దలకు చవగ్గా భూములు??
X
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత.. విశాఖ పట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చాలానే మాటలు వచ్చాయి. అటు సినీ రంగం నుంచి.. ఇటు ప్రభుత్వం నుంచి రెండేళ్లుగా చాలానే టాక్స్ నడిచాయి. ఈ విషయంలో ఈ రెండేళ్లలో పెద్దగా బండి కదలకపోయినా.. ఇప్పుడు కదలిక వచ్చిందని తెలుస్తోంది. విశాఖో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు ల్యాండ్ కేటాయించినట్లుగా వస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

హైద్రాబాద్ లో టాలీవుడ్ ని ఓ 10-15 మంది నడిపించేస్తుంటారని అంటారు. వారిలో బడా నిర్మాతలైన ఓ నలుగురు చాలా ఇంపార్టెంట్. వీళ్లు కొంతకాలంగా వైజాగ్ లో సినిమా రంగానికి భూములు కేటాయింపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సినిమా రంగం విశాఖలో అభివృద్ధి చెందాలంటే.. ఏమేం అవసరమో ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ల ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని చెప్పాలి. విశాఖలో ప్రైమ్ లొకేషన్ లో భారీ లాండ్ కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీకి సిటీకి ఆయువు పట్టు లాంటి ఏరియాలో ల్యాండ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ కేటాయింపులోను.. దీనిపై ఫ్యూచర్ లోనూ చక్రం తిప్పేవాళ్లు ఆ నలుగురు నిర్మాతలే అని తెలుసు కదా.