Begin typing your search above and press return to search.

గుండెల్లో ల్యాండ్ మైన్ పేల్చేసింది

By:  Tupaki Desk   |   10 Dec 2021 1:30 AM GMT
గుండెల్లో ల్యాండ్ మైన్ పేల్చేసింది
X
జ‌న్న‌త్ 2, రాజ్‌3డీ చిత్రాల‌తో హాట్ లేడీగా అందాల ఆటం బాంబ్‌గా పేరు తెచ్చుకుంది ఇషా గుప్తా. సినిమాల కంటే స్పెష‌ల్ సాంగ్ ల‌తో ఆక‌ట్టుకున్న ఇషా సోస‌ల్ మీడియాతో మ‌రింత పాపులారిటీని సొంతం చేసుకుంది. హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో నెటిజ‌న్ ల‌ని ఫిదా చేస్తున్న ఇషా అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం జంక‌డం లేదు. నో లిమిటేష‌న్స్ అంటూ అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో చెల‌రేగిపోతూ వీక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తోంది.

తెలుగులో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `విన‌య విదేయ రామా`లోని ఓ ప్ర‌త్యేక గీతంలో త‌ళుక్కున మెరిసి ప్రేక్ష‌కుల్ని త‌న అంద‌చందాల‌తో మెస్మ‌రైజ్ చేసింది. అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది.

అయితే నెట్టింట్లోనే ఎక్కువ‌గా వుంటూ త‌న అందాల‌తో ఆడుకుంటోంది. సోష‌ల్‌మీడియా ఇన్ స్టా వేదిక‌గా ఇషా పెట్టే పోస్ట్‌ల‌కు చాలా మందే ఫాలోవ‌ర్స్ వున్నారు. భారీ అందాల‌ని ప్ర‌ద‌ర్శిస్తూ ఇన్ స్టాలో ఇషా చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏం చేసినా త‌న మార్కు బోల్డ్ కంటెంట్ వుండేలా జాగ్ర‌త్త‌ప‌డుతూ వుంటుంది.

అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఇషాని మించిన వారు లేరు. టైమ్‌ని బ‌ట్టి ఇన్ స్టా వేదిక‌గా హాట్ ఫొటోల‌ని పోస్ట్ చేస్తూ గ‌త కొంత కాలంగా ర‌చ్చ చేస్తున్న ఇషా తాజాగా షేర్ చేసిన ఫొటోలు మ‌రింత మంట పెట్టేస్తున్నాయి.

బ్లాక్ డ్రెస్‌లో యెద అందాల‌ని ప్ర‌ద‌ర్శిస్తూ ఇషా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.ఈ ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఇషా గుండెల్లో ల్యాండ్ మైన్ పేల్చేసిందంటున్నారు. ఎమ్మెక్స్ ప్లేయ‌ర్ ఓటీటీ కోసం ఇషా చేసిన `న‌కాబ్‌` ఇటీవ‌లే స్ట్రీమింగ్ అయింది.