Begin typing your search above and press return to search.

లలిత్ మోదీ.. సుస్మితా సేన్ పదేళ్ల కిందటే బందం..

By:  Tupaki Desk   |   15 July 2022 11:30 AM GMT
లలిత్ మోదీ.. సుస్మితా సేన్ పదేళ్ల కిందటే బందం..
X
ఉన్నట్లుండి గురువారం భారత క్రీడా, సినీ వర్గాల్లో సంచలనం రేగింది. బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్
ఛైర్మన్ లలిత్‌ మోదీ ప్రకటించారు. సుస్మితాతో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇటీవలే ఆమెతో కలిసి ప్రపంచ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వార్త సామాజిక
మాధ్యమాలను ఊపేసింది. వీరిద్దరి పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు లలిత్ కాసేపటికే స్పష్ట త ఇచ్చారు. ప్రస్తుతానికి డేటింగ్ లో మాత్రమే ఉన్నామని, పెళ్లి ఏమీ లేదని,భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. తామిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.ఇప్పటిది కాదు ఈ బంధం

లలిత్ మోదీకి ఐపీఎల్ ఫౌండర్ గా మంచి పేరుంది. వ్యాపార కుటుంబానికి చెందిన ఆయన ఉన్నత స్థాయి జీవితం అనుభవించారు. అయితే, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులతో
భారత్ నుంచి పారిపోయారు. 2010 నుంచే లండన్ లో ఉంటున్నారు. 1991లో మినాల్ మోదీని ఆయన వివాహమాడారు. మినాల్ 2018లో క్యాన్సర్ కారణంగా చనిపోయారు. ఇక
సుస్మితాతో ఆయనకు 2013 నుంచే అనుబంధం ఉన్నట్లు కనిపిస్తోంది.

గురువారం తమ బంధంపై లలిత్ మోదీ వివరణ ఇచ్చాక 2013 నాటి ట్వీట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. "నేను కమిట్ అయ్యాను. నువ్వు చాలా దయగలదానివి. ఏదేమైనా వాగ్దానాలు ఉల్లంఘనకు గురవుతాయి. కట్టుబాట్లకే గౌరవం. నా ఎస్ఎంఎస్ కు సమాధానం ఇవ్వు . చీర్స్ లవ్" అంటూ సేన్ను
ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీనికి సుస్మిత గోట్చా 47 అంటూ బదులిచ్చారు. దీంతో అప్పటినుంచే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ మొదలైందని నెటిజన్లు అంటున్నారు.ఇటీవల ప్రియుడికి సుస్మితా గుడ్ బై

సుస్మితా సేన్‌ ఇటీవలి వరకు తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్‌ చేశారు. కొన్ని కారణాలతో బ్రేకప్‌ చెప్పారు. కానీ, సేన్ విశ్వ
సుందరిగా ఎన్నికై 28 ఏళ్లయిన నేపథ్యంలో.. గత నెలలో ఇచ్చిన పార్టీలో రోహ్మాన్ పాల్గొన్నాడు. సుస్మితా పెంచుకుంటున్న అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశాడు. కాగా, లలిత్ మోదీ
ఐపీఎల్ ఫౌండర్ గా ఓ దశలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు.

భారత క్రికెట్ ను శాసించగలిగే స్థితికి వెళ్లాడు. కానీ, అనూహ్యంగా పతనమయ్యాడు. 2007 వన్డే ప్రపంచ కప్ లో ఘోర
వైఫల్యంతో భారత క్రికెట్ సంక్షోభంలో పడిన సందర్భంలో.. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) వంటి రెబల్ లీగ్ పుట్టుకొచ్చి.. బీసీసీఐ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో.. ఐపీఎల్ వంటి ఆకర్షణీయ లీగ్ ను రూపొందించి జనరంజకం చేసిన ఘనత అతడిది. కానీ, అవినీతి మరకతో అభాసుపాలయ్యారు.సుస్మితా జాబితా పెద్దదే..

సుస్మితా సేన్ ప్రియుల జాబితా చాలా పెద్దదే. దిగ్గజ వ్యాపారి అనిల్ అంబానీ నుంచి ప్రముఖ క్రికెటర్ వసీమ్ అక్రమ్ సహా 12 మందితో సుస్మితా డేటింగ్ చేసినట్లు కథనాలున్నాయి.
ఇదే జాబితాలో హాట్ మెయిల్ ఫౌండర్, ప్రవాస భారతీయుడు సబీర్ భాటియా సహా మరికొందరు సినీ ప్రముఖులు ఉన్నారు. అయితే, వ్యక్తిత్వం పరంగా సుస్మితకు మంచి మార్కులే
ఉన్నాయి. వివాహ బంధంలో లేనప్పటికీ.. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఇద్దరు అమ్మాయిలను తెచ్చుకుని సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా చూసుకుంటోంది. ఇక వ్యక్తిగత
జీవితంలో ఆమె ఇష్టాయిష్టాలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం.