Begin typing your search above and press return to search.

ల‌లిత్ మోడీతో సుస్మిత డేటింగ్.. త్వ‌రలోనే పెళ్లి!?

By:  Tupaki Desk   |   14 July 2022 4:58 PM GMT
ల‌లిత్ మోడీతో సుస్మిత డేటింగ్.. త్వ‌రలోనే పెళ్లి!?
X
తాను సుస్మితా సేన్ తో డేటింగ్ లో ఉన్నట్లు ప్ర‌ముఖ బిజినెస్ మేన్ లలిత్ మోడీ ధృవీకరించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ ట్వీట్ లో సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించారు. నిజానికి ఇది ఊహించ‌నిది. స‌డెన్ గా బ‌య‌ట‌ప‌డ్డ కొత్త విష‌యం కావ‌డంతో సుష్ అభిమానులు ఎంతో స‌ర్ ప్రైజ్ అవుతున్నారు.

అంతేకాదు ఈ వార్త సుస్మితాసేన్ సోద‌రుడికి కూడా షాక్ నిచ్చింది. తాను స్వ‌యంగా త‌న సోద‌రితో మాట్లాడి క‌న్ఫామ్ చేసుకుంటాన‌ని తెలిపాడు.

సుస్మితా సేన్ .. వ్యాపారవేత్త లలిత్ మోడీ డేటింగ్ విష‌యం వెకేష‌న్ ఫోటోల లీకుల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఈ రోజు (జూలై 14)న‌ వారి ఇటీవ‌లి పర్యటన నుండి కొన్ని ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వార్తలను ధృవీకరించారు.

ల‌లిత్ మోడీ సుస్మితను తన `బెటర్ హాఫ్` అని సంబోధించాడు. ఇది ఇద్దరికీ కొత్త ప్రారంభం అని చెప్పాడు. మరో పోస్ట్ లో ఇద్దరూ డేటింగ్ మాత్రమే చేస్తున్నామ‌ని పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశాడు.

అందరిలాగే సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ కూడా ఈ వార్త విని ఆశ్చర్యపోయాడు. ``నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నేను దీని గురించి మా సోదరితో మాట్లాడతాను`` అంటూ త‌న‌ని సంప్ర‌దించిన మీడియాకు జ‌వాబిచ్చారాయ‌న‌.

సుష్ తో డేటింగ్ పై పెద్దాయ‌న ఏమ‌ని చెప్పారంటే...``కుటుంబాలతో కూడిన గ్లోబల్ టూర్ #మాల్దీవులు # సార్డినియా తర్వాత లండన్ కు తిరిగి వచ్చాను - నా #బెటర్ హాఫ్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు - ఎట్టకేలకు కొత్త ప్రారంభం. చంద్రుడు పైకి.. అని రాసారు. ``స్పష్టత కోసం చెబుతున్నా.. ఇంకా వివాహం కాలేదు - ఒకరితో ఒకరు డేటింగ్ మాత్రమే. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది`` అని మోడీ వ్యాఖ్యానించారు.

సుస్మిత ఇంతకుముందు మోడల్ రోహ్మాన్ షాల్ తో కొంతకాలం డేటింగ్ చేసింది. ఇటీవలే వీరిద్దరూ విడిపోయారు. ఈ వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల‌తో సుష్ డేటింగ్ చేసింద‌ని క‌థ‌నాలొచ్చినా కానీ చాలా కాలం పెళ్లి మాట లేకుండా తాను ఒంట‌రిగానే ఉంది. ఇప్పుడు ల‌లిత్ మోడీతో డేటింగ్ సాగిస్తోంది.