Begin typing your search above and press return to search.

లాల్ సింగ్ చద్దా ట్రైలర్: అమీర్ ఖాన్ మ‌రో క్లాసిక్ తీసాడు!

By:  Tupaki Desk   |   30 May 2022 3:29 AM GMT
లాల్ సింగ్ చద్దా ట్రైలర్: అమీర్ ఖాన్ మ‌రో క్లాసిక్ తీసాడు!
X
ఎట్టకేలకు నిరీక్ష‌ణ ఫ‌లించింది! సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు క్రికెట్ ఔత్సాహికులందరి ఉత్కంఠ‌కు తెర దించుతూ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంత‌ర్జాలంలోకి వచ్చింది. అమీర్ ఖాన్- కరీనా కపూర్ ఖాన్- చైతన్య అక్కినేని నటించిన 'లాల్ సింగ్ చద్దా' ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా మార్మోగుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ T20 ముగింపు మ్యాచ్ లో భారీ అభిమానుల స‌మ‌క్షంలో టీవీక్ష‌కులు వీక్షిస్తుండ‌గా లాంచ్ అయ్యింది.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ - సినీ అభిమానుల్లో ఉత్కంఠ‌ను క‌లిగించింది. ప్రపంచ టెలివిజన్ ప్లాట్ ఫారమ్ లో క్రీడా ప్రపంచం సాక్షిగా ఒక మూవీ ట్రైలర్ ను ఇంత గ్రాండ్ గా విడుదల చేయడం ఇదే మొదటిసారి. లాల్ సింగ్ చద్దా ట్రైల‌ర్ అభిమానుల్ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌లేదు. సినిమాపై ఉత్కంఠ పెంచే ఎన్నో అంశాల మేలుక‌ల‌యిక‌తో ట్రైల‌ర్ ర‌క్తి క‌ట్టించింది. ట్రైలర్ ఆద్యంతం గుండెల్ని ట‌చ్ చేసే ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది.

ఒక అమాయకుని ప్రపంచంలోకి ప్రేక్ష‌కులు ఒదిగిపోయేంత‌గా అమీర్ న‌ట‌న క‌ట్టి ప‌డేసింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసేంత గొప్ప కంటెంట్ ఇందులో ఉంద‌ని అర్థ‌మైంది. లాల్ సింగ్ చద్దాను ఒక ప‌సి హృద‌యంతో చిన్న పిల్లాడిలా వీక్షించే దృష్టితో వీక్షించాల‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ప‌సిపిల్లాడి మ‌న‌స్త‌త్వం ఉన్న అమీర్ ఖాన్ పాత్ర‌ అతనిలోని నిదానంగా వ్యవహరించే విధానం ఒక పిల్లాడిలా ఆశావాదం సినిమాకి ప్ర‌ధాన బ‌లం అయితే.. త‌న‌ తల్లితో మధురమైన బంధం .. చిన్ననాటి ప్రియురాలితో ప్రేమ ప్ర‌తిదీ ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

మంచు ప‌ర్వ‌తాల్లో సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన‌ ఈ చిత్రం భారతీయత‌ను దేశ‌భ‌క్తిని ప్లెజెంట్ గా ప్రదర్శిస్తుంది. అమీర్ - కరీనా కపూర్ ఖాన్ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్' తర్వాత మ‌రోసారి క‌లిసి ప‌ని చేసారు. ఈ జంట‌ న‌డుమ అందమైన కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంది. ఇక అక్కినేని నాగ‌చైత‌న్య‌కు ఇది ప‌ర్ఫెక్ట్ బాలీవుడ్ డెబ్యూ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చైతూ పాత్ర కూడా ఇందులో ఎంతో ఉత్కంఠ‌ను పెంచుతుంద‌ని ట్రైల‌ర్ లో అత‌డి న‌ట‌న వెల్ల‌డిస్తోంది.

ఈ చిత్రంలో మోనా సింగ్ అమీర్ తల్లి పాత్రలో న‌టించారు. లాల్ సింగ్ చద్దా ట్రైలర్ హృద‌యాల‌ను గెలుచుకుంది. థియేటర్ల‌లో అద్భుత‌మైన వినోదాన్ని ఆస్వాధించేందుకు ఆస్కారం ఉన్న సినిమా ఇద‌ని ప్రామిస్ చేసే ట్రైల‌ర్ ఇది.

సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత చాలా కాలానికి అమీర్ ఖాన్ - అద్వైత్ చందన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం తిరిగి కలిసి ప‌ని చేశారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు - వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.