Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ టీమ్‌కి షాకిస్తూ థాంక్స్ చెప్పిన అమీర్ ఖాన్‌

By:  Tupaki Desk   |   15 Feb 2022 1:30 PM GMT
ప్ర‌భాస్ టీమ్‌కి షాకిస్తూ థాంక్స్ చెప్పిన అమీర్ ఖాన్‌
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్ర‌భాస్ న‌టిస్తున్న `ఆది పురుష్‌` టీమ్ కి బిగ్ షాకిచ్చారు. ఇదే సంద‌ర్భంగా థాంక్స్ చెప్ప‌డం హాట్ టాపిక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న `థ‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్‌` ఆవించి ఫలితాన్ని అందించ‌క‌పోవ‌డంతో మ‌రో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు.

దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత అమీర్ ఖాన్ న‌టించిన చిత్రం `లాల్ సింగ్ చ‌ద్దా`. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అమీర్‌ఖాన్‌, కిర‌ణ్ రావు ల‌తో క‌లిసి అజిత్ అంధారే, రాధికా చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదే మూవీతో టాలీవుడ్ హీరో న‌గాచైత‌న్య బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అదే రోజు య‌ష్ నటించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో క్లాష్ అవుతోంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందించారు.

కావాల‌ని పోటా పోటీగా రిలీజ్ చేయ‌డం లేద‌ని, రిలీజ్ కి వేరే డేట్ కుద‌ర‌కే ఈ తేదీని రిలీజ్ చేస్తున్నామ‌ని, ఈ విష‌యంలో ఏమైనా అసౌకర్యాన్ని క‌లిగించి వుంటే క్ష‌మించాలని `కేజీఎఫ్` మేక‌ర్స్‌ని కోర‌డం తెలిసిందే.

అయితే తాజాగా మంగ‌ళ‌వారం ఈ మూవీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నామ‌ని, ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 11న విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు. అదే రోజున ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి బైలింగ్వ‌ల్ మూవీ `ఆది పురుష్‌` విడుద‌ల కాబోతోంది.

ఆ డేట్ న `లాల్ సింగ్ చ‌ద్దా` ని రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన చిత్ర బృందం ఈ సంద‌ర్భంగా `ఆదిపురుష్` నిర్మాత‌ల‌కు, చిత్ర బృందానికి థాంక్స్ చెప్ప‌డం ప‌లువురికి విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

`లాల్ సింగ్ చ‌ద్దా` చిత్రాన్ని ముందు ప్లాన్ చేసిన‌ట్టుగా ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డం లేదు. కార‌ణం అనుకున్న స‌మ‌యానికి సినిమాని పూర్తి చేయలేక‌పోవ‌డ‌మే. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2022న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నాం.

ఈ సంద‌ర్భంగా టి సిరీస్ అధినేత ఎం. భూష‌న్ కుమార్ - ఓం రౌత్ - `ఆది పురుష్‌` టీమ్ అంద‌రికి మా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాం. మ‌మ్మ‌ల్ని అర్థం చేసుకుని మాకు స‌హ‌క‌రిస్తున్నందుకు వారికి ధ‌న్య‌వాదాలు.

మా `లాల్ సింగ్ చ‌ద్దా` ఆగ‌స్టు 11, 2022న రావ‌డానికి వీలుగా ఎంతో ఆస‌క్తిగా ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న `ఆదిపురుష్‌` రిలీజ్ డేట్ ని మార్చడానికి అంగీక‌రించినందుకు వారికి ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం` అని అమీర్‌ఖాన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ కి లాల్ సింగ్ చద్దా ని విడుద‌ల చేస్తున్నామంటూ ప్ర‌క‌టించిన అమీర్‌ఖాన్ ఈ సంద‌ర్భంగా కేజీఎఫ్ టీమ్ పై ఇదే త‌ర‌మా వ్యాఖ్య‌లు చేశారు.

కావాల‌ని పోటా పోటీగా రిలీజ్ చేయ‌డం లేద‌ని, రిలీజ్ కి వేరే డేట్ కుద‌ర‌కే ఈ తేదీని రిలీజ్ చేస్తున్నామ‌ని, ఈ విష‌యంలో ఏమైనా అసౌకర్యాన్ని క‌లిగించి వుంటే క్ష‌మించాలని కోరిన అమీర్‌ఖాన్ ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అమీర్‌ఖాన్ ఇచ్చిన షాక్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ `ఆది పురుష్` కోసం ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ అభిమానులు మ‌రి కొన్ని రోజులు వేచిచూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.