Begin typing your search above and press return to search.

#ల‌క్ష్య‌: త‌ప్పించి గెల‌వాలా? త‌ప్పుడు దారిలో గెల‌వాలా?

By:  Tupaki Desk   |   1 Dec 2021 10:46 AM GMT
#ల‌క్ష్య‌: త‌ప్పించి గెల‌వాలా? త‌ప్పుడు దారిలో గెల‌వాలా?
X
ఆట‌లో గెల‌వాలంటే ఏం చేయాలి? బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని పోటీలో లేకుండా త‌ప్పించి గెల‌వాలా? లేక సిస‌లైన ప్ర‌తిభ‌తో సూటిగా త‌ల‌బ‌డి గెల‌వాలా? లేక ఇంకేదైనా త‌ప్పుడు దారిలో గెల‌వాలా?

గెలుపు కోసం ర‌క‌ర‌కాల మార్గాలు. ఒక్కొక్క‌రు ఒక్కో దారిని ఎంచుకుంటారు. మ‌రి ల‌క్ష్యం దిశ‌గా వెళ్లే క‌థానాయ‌కుడి తీరు ఎలా ఉండాలి? గెలుపు కోసం అత‌డేం చేయ‌బోతున్నాడో తెలియ‌లంటే ల‌క్ష్య సినిమా చూడాల్సిందే. తాజాగా రిలీజైన ల‌క్ష్య‌ ట్రైల‌ర్ ఆద్యంతం థ్రిల్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్ గా నాగ‌శౌర్య రూపురేఖ‌ల్లో ఛేంజోవ‌ర్ ఎంతో అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది.

ఈ సినిమాలో నాగ శౌర్య విలుకాడిగా క‌నిపిస్తున్నారు. అత‌డిలో స్ఫూర్తి నింపే అమ్మాయిగా రొమాంటిక్ బ్యూటీ కేతిక శ‌ర్మ క‌నిపించ‌నుంది. కేతిక‌తో శౌర్య రొమాన్స్ ఒక వైపు ఆట‌లో గెలిచేందుకు త‌పించే క్రీడాకారుడిగా శౌర్య ప‌నిత‌నం ప్ర‌తిదీ ఆక‌ర్షిస్తున్నాయి.

ప‌డి లేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాద‌క‌రం! అంటూ జ‌గ‌ప‌తి బాబు పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో ద్రాణాచార్య అంత ట్యాలెంటెడ్ ఎవ‌రు? నిజాయితీగా అబ‌ద్ధం ఆడ‌కుండా బ‌త‌క‌డం ఎలా అనే ఎలిమెంట్స్ ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి. శౌర్య పాత్ చిత్ర‌ణ సినిమాకి ప్ర‌ధాన ఆయువు కానుంది. ల‌క్ష్య త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. త‌ప్పించి గెల‌వాలా? త‌ప్పుడు దారిలో గెల‌వాలా? అన్న డైలాగ్ ని బ‌ట్టి సినిమాలో ట్విస్టుల్ని.. క్రీడల్లో రాజ‌కీయాల్ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇందులోనే హీరో ప్రేయ‌సి మిస్ అండ‌ర్ స్టాండిగ్ మ‌రో ట్విస్టు. జెర్సీ లాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకి ఇది భిన్న‌మైన ఫీల్ ని క‌లిగిస్తోంది.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్ కె. నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు.. శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే పోస్ట‌ర్ లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళ్లాయి. ఈ చిత్రంలో పార్ధు అనే క్రీడాకారుడి పాత్ర‌లో శౌర్య క‌నిపిస్తారు. ఈ పాత్ర కోసం అత‌డు పూర్తిగా రూపం మార్చాడు. రియ‌ల్ క్రీడాకారుడిలా లుక్ ని తీర్చిదిద్దాడు. దీనికోసం జిమ్ లో తీవ్రంగానే శ్ర‌మించారు శౌర్య