Begin typing your search above and press return to search.

'లక్ష్య' కథ విన్న వెంటనే బాగా ఇన్స్పైర్ చేసింది: నాగశౌర్య

By:  Tupaki Desk   |   9 Dec 2021 12:45 PM GMT
లక్ష్య కథ విన్న వెంటనే బాగా ఇన్స్పైర్ చేసింది: నాగశౌర్య
X
యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌర్య కెరీర్ లో వస్తున్న ఈ మైలురాయి 20వ చిత్రంలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని రేపు శుక్రవారం (డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రాచీన విలు విద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న మొట్ట మొదటి సినిమా ''లక్ష్య''. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. అలానే ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడమే కాకుండా సినిమాకు బజ్ తెచ్చిపెట్టింది.

'లక్ష్య' చిత్రంలో నాగశౌర్య కండలు తిరిగిన 8 ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చాక్లెట్ బాయ్ - లవర్ బాయ్ తరహా పాత్రల్లో మెప్పిస్తూ వచ్చిన శౌర్య.. ఇందులో గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లోకి మారిపోయారు. అర్చరీ క్రీడాకారుడిగా కనిపించడానికి యువ హీరో ఎంతగా కష్టపడ్డారో తెలియజేసే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

నాగశౌర్య జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన క‌స‌రత్తులు చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేయడాన్ని ఇందులో చూడొచ్చు. బాడీని ఫిట్ గా ఉంచుకోడానికి యంగ్ హీరో పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ షూటింగ్ కోసం ఐదు రోజులు నీళ్లు కూడా త్రాగలేదు. కనీసం తన లాలాజలం కూడా మింగకుండా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ చిత్రీకరణ పూర్తి చేయడం గమనార్హం.

'లక్ష్య' సినిమాలో నాగశౌర్య మేకోవర్ కోసం ఎంతగా కష్టపడ్డారో చూస్తే సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా వావ్ అనక మానరు. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ లో తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమించిన యువ హీరోకి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

ఇకపోతే రేపు 'లక్ష్య' సినిమా థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా శౌర్య ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ఈ సినిమా కథ విన్న వెంటనే బాగా ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. ''ఒక యాక్టర్ గా ప్రతీ సినిమాకు కొత్తగా వేరియేషన్స్ చూపించాలని అనుకుంటారు.. లక్ష్య చిత్రంలో నేను అలానే కనిపిస్తాను. ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో ఆర్చరీ గురించి చూపిస్తున్నాం. 'రొమాంటిక్' తో హిట్ కొట్టిన కేతిక శర్మ ఇందులో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది'' అని అన్నారు.

''జగపతిబాబు - సచిన్ కెడ్కర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కాల భైరవ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నిర్మాతలు ఏషియన్ సునీల్ గారు - శరత్ మరార్ గారు - పుస్కుర్ రామ్మోహన్ గారు ఈ సినిమాకు త్రిశూలంగా వర్క్ చేశారు. బడ్జెట్ కు వెనుకాడకుండా సినిమాకు ఏమి కావాలో అన్నీ సమకూర్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి.. విజువల్ ట్రీట్ గా ఉంటుంది. అందరూ థియేటర్లలో 'లక్ష్య' సినిమా చూడండి'' అని నాగశౌర్య చెప్పుకొచ్చారు.

కాగా, 'లక్ష్య' చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ పతకాలపై రూపొందించారు. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ నిర్మాతలు. కాలభైరవ సంగీతం సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేయగా.. సృజన మని సంభాషణలు రాశారు.

ఇది ఆటతోపాటు బలమైన భావోద్వేగాలు ఉన్న చిత్రమని మేకర్స్ తెలిపారు. రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 కి పైగా థియేటర్లలోనూ.. ఓవర్ సీస్ లో వంద థియేటర్లలో ''లక్ష్య'' సినిమా విడుదల కాబోతోంది.