Begin typing your search above and press return to search.

అత‌డు.. ఆమె.. మ‌ధ్య‌లో వీర‌గంధం

By:  Tupaki Desk   |   6 Jan 2019 2:30 AM GMT
అత‌డు.. ఆమె.. మ‌ధ్య‌లో వీర‌గంధం
X
అవును.. అత‌డు.. ఆమె .. మ‌ధ్య‌లో వీర‌గంధం. ఇది ల‌క్ష్మీస్ వీర‌గంధం. ఓవైపు ఎన్టీఆర్ జీవితం పై ఒకేసారి ఇద్ద‌రు సినిమాలు తీస్తున్నారు. అవి ఇరు ప్రాజెక్టులు ఇప్ప‌టికే వివాదాల్లోనూ ఉన్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో తొలి భాగం క‌థానాయ‌కుడు సెన్సార్ పూర్తి చేసుకుని సాఫీగా రిలీజ‌వుతున్నా, మ‌హ‌నాయ‌కుడు (పార్ట్ 2) వివాదాలు త‌ప్ప‌దని సంకేతాలందాయి. మ‌రోవైపు ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలోని అన్న‌గారి సినిమా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` వివాదాస్ప‌దం అవుతోంది. ఇందులో ఆర్జీవీ ఏరికోరి వివాదాల్ని రాజేసే స‌న్నివేశాల‌తో నిజాల్ని చూపిస్తున్నాన‌ని ప్ర‌చారం సాగిస్తుండ‌డంతో ఇప్ప‌టికే పోలీస్ కేసుల వ‌ర‌కూ వెళ్లింది.

అదంతా అటుంచితే, అత‌డు, ఆమె .. మ‌ధ్య‌లో ఈయ‌న అన్న‌ట్టు వేరొకాయ‌న `ల‌క్ష్మీస్ వీర‌గంధం` అంటూ ఎన్టీఆర్‌ బ‌యోపిక్ ని కొత్త‌గా తీస్తున్నానంటూ హ‌డావుడి చేయడం చ‌ర్చ‌కొచ్చింది. ఆస‌క్తిక‌రంగా ఆ సినిమా తీస్తున్నాయ‌న‌తో ద‌ర్శ‌కుడు తేజ చేతులు క‌లిపారు. ఆ మేర‌కు స‌ద‌రు చిత్ర ద‌ర్శ‌కుడు కేతిరెడ్డి స్వ‌యంగా తెలుగు మీడియాకు ప్రెస్ నోట్ ని పంప‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ల‌క్ష్మీస్ వీర‌గంధం పేరుతో సినిమా తీస్తున్న కేతిరెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు ఎటెండ్ అయిన తేజ ఆయ‌న్ని తెగ పొగిడేశారు. ఈ స్నేహం ఎంతో గొప్పది అని ప్ర‌శంస‌లు కురిపించారు.

వాస్త‌వానికి న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ కి తేజ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించాల్సింది. కానీ ఆయ‌న మ‌ధ్య‌లోనే వైదొలిగారు. బాల‌య్య బాబుతో పొస‌గ‌క పోవ‌డం వ‌ల్ల‌నే తేజ త‌ప్పుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం అయ్యింది. అయితే ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే చిత్ర‌యూనిట్ కానీ ఎన్టీఆర్ రైట‌ర్ కానీ స‌రైన ఆన్స‌ర్ ఇవ్వ‌డం లేదు. ఆ ప్ర‌శ్న బాల‌య్య బాబునే అడ‌గాల‌ని ర‌చ‌యిత సాయిమాధ‌వ్ ఇదివ‌ర‌కూ అన్నారు. ఇక‌పోతే క‌థానాయ‌కుడు రిలీజ్ స‌మ‌యంలో ఇలా కేతిరెడ్డి బ‌ర్త్ డే వేడుక‌ల్లో పాల్గొన‌డం ద్వారా తేజ ఏ సంకేతాలు ఇవ్వ‌ద‌లిచారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ కి పోటీగా తీస్తున్న వేరొక సినిమాకి తేజ స‌పోర్టును అందిస్తున్నారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు త్వరలోనే తమ `చిత్రం మూవీస్` బ్యాన‌ర్‌ ద్వారా తేజ కుమారుడును హీరోగా పరిచయం చేస్తూ, ఒక బ‌హుభాషా చిత్రాన్ని నిర్మిస్తాన‌ని కేతిరెడ్డి ప్ర‌క‌టించాడు. తాను దర్శకత్వ ం వహించే లక్మిస్ వీరగ్రంధం.. టీజ‌ర్ ను 9-01-2019 న విడుదల చేస్తున్నామ‌ని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. మొత్తానికి ఇదో కొత్త కుంప‌టి మొద‌లైంద‌న్న కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.