Begin typing your search above and press return to search.

ఇప్పుడు చూస్తారంటావా వర్మా?

By:  Tupaki Desk   |   21 April 2019 10:03 AM IST
ఇప్పుడు చూస్తారంటావా వర్మా?
X
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో కోర్టు వాయిదా వేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుందని సమాచారం . ఈ నెల 26న విడుదల చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయట. క్లియరెన్స్ వచ్చేసిందని ఎలాగూ దీని వల్ల ఫలితాలకు వచ్చే ప్రభావం ఏమి ఉండదు కాబట్టి ఆ మేరకు వర్మ టీం కు సర్టిఫికేట్ వచ్చిందట.

25న రావాల్సిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీత నిరవధికంగా వాయిదా పడటంతో ఏ తెలుగు సినిమా లేని అవకాశాన్ని వర్మ వాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎంత లేట్ గా రిలీజ్ అవుతున్నా ఏపిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి జనంలో అంత ఆసక్తి ఉంటుందా అన్నది అనుమానమే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది.

ఆత్రం పట్టలేని ప్రేక్షకులు పైరసీ రూపంలో తెలంగాణా రాష్ట్రానికి ఏదో పని మీద వెళ్ళినప్పుడో ఇప్పటికే చూసేశారు. దాంట్లో ప్లస్సులు మైనస్సులు అన్ని మీడియా వర్గాల్లో కవరైపోయాయి. ఇప్పుడు తాపీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రిలీజ్ చేస్తే ఎంత మేరకు వసూళ్లు వస్తాయనేది ట్రేడ్ కి సైతం అనుమానంగా ఉంది.

దానికి తోడు అదే రోజు అవెంజర్స్ ఎండ్ గేమ్ వస్తోంది. దాని ప్రభంజనం తట్టుకోవడం అంత ఈజీ కాదు. సరే ఏదో సామెత చెప్పినట్టు కాదనుకున్న పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఎంతోకొంత రాకపోదా అని విడుదలకు రెడీ కావడం మంచి నిర్ణయమే. అధికారిక ప్రకటన ఇవాళ లేదా రేపు వచ్చే అవకాశం ఉంది