Begin typing your search above and press return to search.

పింక్ బికినీలో ర‌త్తాలు ర‌చ్చ మ‌రో లెవ‌ల్లో

By:  Tupaki Desk   |   3 Jun 2021 2:30 PM GMT
పింక్ బికినీలో ర‌త్తాలు ర‌చ్చ మ‌రో లెవ‌ల్లో
X
ర‌త్తాలు అలియాస్ రాయ్ ల‌క్ష్మీ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల లాక్ డౌన్ సీజ‌న్ లో వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతున్న రాయ్ ల‌క్ష్మి సెకండ్ వేవ్ క‌ల్లోలంలో త‌న అభిమానుల‌కు బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు. నిరంత‌ర ఫోటోలు వీడియోల షేరింగ్ తో ర‌చ్చ చేస్తున్నార‌నే చెప్పాలి.

దానికి అభిమానుల నుంచి సూటిగా కౌంట‌ర్లు ప‌డుతున్న‌ సంగ‌తి తెలిసిందే. క‌రోనా సోకి వేలాదిగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతుంటే బ‌ర్త్ డే పార్టీలు ఫోటోషూట్లు అంటూ చెల‌రేగుతుందా? అంటూ కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించారు. అవేవీ ప‌ట్ట‌ని రాయ్ ల‌క్ష్మి త‌న ప‌నిలో తాను ఉన్నారు.

తాజాగా పింక్ బికినీ లో ర‌త్తాలు ఫోజులు అగ్గి రాజేస్తున్నాయి. పింక్ టాప్ పై బ్లూ డెనిమ్ స్లిట్ గౌన్ ని ధ‌రించి క‌ళ్ల‌కు రేబాన్ తో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. రాయ్ ల‌క్ష్మి లో హాట్ కంటెంట్ అంత‌కంత‌కు పెరుగుతోంది. వ‌రుస‌గా సోష‌ల్ మీడియాల్లో క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ ఆదాయం ఆర్జిస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే. రాయ్ లక్ష్మి ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇవి వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి.