Begin typing your search above and press return to search.

రాంగ్ టైమ్ లో ఏంటిది ర‌త్తాలు.. నీకిది త‌గునా?

By:  Tupaki Desk   |   11 May 2021 12:30 AM GMT
రాంగ్ టైమ్ లో ఏంటిది ర‌త్తాలు.. నీకిది త‌గునా?
X
రాయ్ ల‌క్ష్మీ అలియాస్ ర‌త్తాలు ఇన్ స్టా సెల‌బ్రేష‌న్ చూశాక షాక్ తినకుండా ఉండ‌లేం. అక్క‌డ ర‌త్తాలు ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఓవైపు క‌రోనా క‌ల్లోలంతో రాయ్ ల‌క్ష్మీ లివింగ్ ప్లేస్ చెన్న‌య్ స‌హా స్వ‌స్థ‌లం బెల్గామ్(క‌ర్నాట‌క‌) కూడా క‌రోనా క‌ల్లోలంతో అల్లాడిపోతుంటే తాను మాత్రం ఇదిగో ఇలా ఇంత రచ్చ కు తెర తీసింది.

కేక్ లు క‌ట్ చేస్తూ బ‌ర్త్ డే లు మ‌ద‌ర్స్ డేలు జ‌రుపుకుంటూ ర‌త్తాలు సెల‌బ్రేష‌న్ ప‌తాక స్థాయికి చేరింది. దీనిపై నెటిజ‌నుల నుంచి ఒక రేంజులోనే కౌంట‌ర్లు ప‌డుతున్నాయ్. ఇలాంటి రాంగ్ టైమింగులో ఇవన్నీ అవ‌స‌ర‌మా? కాస్త మారొచ్చు క‌దా! అని ప‌లువురు సెల‌విస్తున్నారు.

అయినా ఎప్ప‌టికి మార‌తారు? ఈ సెల‌బ్రిటీ గాళ్స్! అంటూ ప‌లువురు క‌ఠినంగానే కౌంట‌ర్లు చేస్తున్నారు. ఇక రాయ్ ల‌క్ష్మీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ అనంత‌రం షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇందులో ఏదో ఓ ఇన్న‌ర్ బ్రాండ్ కి ప్ర‌చారం చేస్తోంది రాయ్ ల‌క్ష్మీ. ఎర్లీ డే సెల‌బ్రేష‌న్ పేరుతో బెడ్ టైమ్ ఫోటోని షేర్ చేసిన ర‌త్తాలు స్మైలీ లుక్ తో కనిపించింది. స్టే పాజిటివ్.. స్టే హోమ్ అని చెబుతున్నా.. ర‌త్తాలు మాత్రం స్వార్థం చూపిస్తోంది! సంపాద‌న కోసం ఇలాంటి వేషాలు వేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయ్...

ఇక చాలాకాలంగా రాయ్ ల‌క్ష్ఈ న‌టించిన సినిమాలేవీ రిలీజ్ కి రాని సంగ‌తి తెలిసిందే. ఈ క్రైసిస్ త‌న‌ను ఒక ర‌కంగా ఇబ్బంది పెట్టినా సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఇలా వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది.. ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆర్జిస్తోంది.