Begin typing your search above and press return to search.

మీక్కావాల్సింది లోన‌ దాగి ఉందన్న ర‌త్తాలు

By:  Tupaki Desk   |   15 March 2021 2:04 AM GMT
మీక్కావాల్సింది లోన‌ దాగి ఉందన్న ర‌త్తాలు
X
సౌత్ నార్త్ అనే విబేధం లేకుండా ఫాలోయింగ్ సంపాదించుకుంది రాయ్ ల‌క్ష్మీ. ఎం.ఎస్.ధోని మాజీ ప్రియురాలిగా త‌న‌కు ద‌క్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తమిళ చిత్రం కర్కా కసదారా తో తెరంగేట్రం చేసి కాంచ‌న చిత్రంతో హిట్టు కొట్టింది.

ఇప్ప‌టికే 50 పైగా చిత్రాల్లో న‌టించేసిన రాయ్ ల‌క్ష్మీ మెగాస్టార్ ఖైదీనంబ‌ర్ 150లో రత్తాలు సాంగ్ తో హాట్ టాపిక్ అయ్యింది. ఇక వీట‌న్నిటినీ మించి రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. రెగ్యుల‌ర్ గా హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తుంటుంది రాయ్ ల‌క్ష్మీ.

ఇటీవ‌ల ఈ అమ్మ‌డు ఒక స్పెష‌ల్ ఫోటోని షేర్ చేసింది. దానికి ఒక తాత్విక శీర్షికను జోడించింది. తెల్లటి దుప్పటితో తనను తాను చుట్టుకున్నా అర్థ‌న‌గ్నంగా క‌నిపిస్తోంది. ఫోటోలో వైట్ కలర్ టీ-కప్ పట్టుకొని కనిపిస్తుంది. చిత్రాన్ని పోస్ట్ చేస్తూ రాయ్ లక్ష్మి ``మీకు కావలసినదంతా ఈ లోపల దాగి ఉంది.``# సంతోషంగా # షైనాన్ # పాజిటివ్ మైండ్సెట్ # స్మైల్ # స్ప్రెడ్లోవ్ అంటూ వ్యాఖ్య‌ను జోడించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే రాయ్ లక్ష్మి రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగు- కన్నడ- మలయాళ భాషలలో ఒక్కొక్క చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఐటెమ్ నంబ‌ర్ లోనూ ద‌ర్శ‌న‌మీయ‌నుంద‌ని తెలిసింది.