Begin typing your search above and press return to search.

వయ్యారాలతో ఇంస్టాను హీటెక్కిస్తున్న కాంచనమాల!

By:  Tupaki Desk   |   10 March 2021 11:30 PM GMT
వయ్యారాలతో ఇంస్టాను హీటెక్కిస్తున్న కాంచనమాల!
X
ఇండస్ట్రీ అనేది అందరికి పూలపానుపు కాలేదు. అలాగని అందరికి ముళ్లపొదలా కూడా ఉండదు. అందరి మార్గాలు వేరైనా చేరుకోవాల్సిన తీరం సినిమానే. కాకపోతే అందం అభినయంతో పాటు కాస్త లక్కు కూడా అవసరమే అంటారు కొందరు. అవసరం లేదు అందం ఉంటే చాలనుకుంటారు మరికొందరు. కానీ ఈ రెండిటిని నమ్మేవారు చాలామంది ఉంటారు. వారిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో.. వారే ఆఖరికి స్టార్డం అందుకుంటారు.. సక్సెస్ అవుతారు అని బలంగా నమ్ముతుంటారు. అలా అనుకుంటూనే తన అందం అభినయంతో దశాబ్దం పైగా ఆకట్టుకుంటూ వస్తోంది యాక్ట్రెస్ లక్ష్మీరాయ్. అమ్మడు కెరీర్ ప్రారంభించింది తెలుగులోనే కానీ.. ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో కూడా స్థిరంగా సెట్ అవ్వలేకపోయింది.

ఇప్పటికి అవకాశాలకోసమే ఎదురుచూస్తోంది. అటు కావాల్సినంత గ్లామర్ పాళ్ళు మెయింటైన్ చేసినప్పటికి ఈ భామ విషయంలో అవకాశం మాత్రం రానంటుందట. అన్నట్టు అదృష్టం కూడా కావాలి కదా! అయితే కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన లక్ష్మీరాయ్.. ఇటు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కూడా పలు సినిమాలు చేసింది. మధ్యలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. కానీ ఇప్పటికి ఐటమ్ హీరోయిన్ గానే చూస్తున్నారట మేకర్స్. ఆ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో లేదో తన అందాలకు అడ్డుతెర తొలగించేసింది. ఎల్లప్పుడూ సారీలో కనిపించే లక్ష్మి.. ఏకంగా టు-పీస్ బికినీ వేసి.. లిప్ లాక్స్ తో హీటేక్కించింది. కానీ ఏం లాభం సినిమా ప్లాప్. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వయ్యారాలను ఒక్కొక్కటిగా ఫొటోస్ రూపంలో పోస్ట్ చేస్తోంది. తాజాగా అమ్మడు ఇంస్టా వేదికగా ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రాయ్ తలుక్కున మెరుస్తుందనే చెప్పాలి. బెడ్ పై వైట్ టాప్ ధరించి ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. ప్రస్తుతం అమ్మడు అవకాశం కోసం వెయిట్ చేస్తోంది.