Begin typing your search above and press return to search.

రత్తాలూ... నువ్వేనా..

By:  Tupaki Desk   |   15 March 2018 8:42 AM IST
రత్తాలూ... నువ్వేనా..
X
కేరళలోని అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. చాలా తెలుగు సినిమాల్లో కనిపించిన అందమైన జలపాతం. దాని ముందో సొగసరి కూర్చుని చిరునవ్వులు పంచుతోంది. నిండయిన చీరకట్టుతో.. తీరయిన కట్టుబొట్టుతో.. చెవులకు జూకాలతో.. చేతికి గాజులతో సంప్రదాయానికి నిలువెత్తు రూపమేమో అనిపించేలా ఉంది. ఇంతకు ముందుకు ఆమెను చాలాసార్లు చూశాం. కానీ ఇలా మాత్రం ఇదే మొదటిసారి చూడటం.. ఆమె మరెవరో కాదు. వెండితెరపై అందాలు ఆరబోయడంలో.. బికినీ డ్రస్సులతో స్క్రీన్ ను హీటెక్కించడంలో స్పెషలిస్టు రాయ్ లక్ష్మి.

ఖైదీ నెంబర్ 150లో రత్తాలు ఐటం సాంగుతో అందరి గుండెలను కొల్లగొట్టిన ఆమె ఇలా ట్రెడిషనల్ గా కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా ఆమె నటించిన జూలీ-2లో హాట్ హాట్ ఫోజుల్తో అందరి మతులు పోగొట్టింది. ఆ సినిమాల్లో మేజర్ అట్రాక్షన్ ఏదన్నా ఉంది అంటే అది రాయ్ లక్ష్మి అందాల ఆరబోతే. తొలిసారి బాలీవుడ్ ఛాన్స్ దొరికిందన్న ఆనందంలో ఎరోటిక్ సినిమాల్లో అంతవరకు ఉన్న హద్దులన్నింటినీ దాటేసింది.

వీలయినప్పుడల్లా బట్టలు అతి పొదుపుగా వాడుతూ బికీనీ పిక్స్ లో రచ్చరచ్చ చేసే రాయ్ లక్ష్మి ఇలా కూడా కనిపిస్తుంది అంటే చాలామందికి నమ్మబుద్ధి కాదు. తమిళ మూవీ నీయా-2 షూటింగ్ లో భాగంగా రాయ్ లక్ష్మి ఇలా కొత్తగా కనిపిచింది. ఈ మూవీలో రాయ్ లక్ష్మితోపాటు కేథరిన్ థ్రెసా.. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు.