Begin typing your search above and press return to search.

పవన్ ఐటెం గాళ్ సూపర్ ఫ్లాప్

By:  Tupaki Desk   |   6 March 2016 4:18 AM GMT
పవన్ ఐటెం గాళ్ సూపర్ ఫ్లాప్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఐటెం సాంగ్ తో పాటు ఓ కీలక రోల్ కూడా చేస్తోంది రాయ్ లక్ష్మీ. అంతకు ముందే లారెన్స్ కాంచన సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగానే దగ్గరైంది ఈ భామ. ఇప్పుడు ఈ చిన్నది నటించిన ఓ మూవీ రిలీజ్ అయిన సంగతి కూడా చాలామంది జనాలకు తెలీకుండా పోయింది.

'శివ గంగ' అంటూ శ్రీరాం - రాయ్ లక్ష్మిలు నటించిన ఓ హారర్ సినిమాని తెలుగులో విడుదల చేస్తామని ఎప్పుడో చెప్పారు. మొదట్లో కాస్త ఇంట్రెస్ట్ అనిపించినా, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రావడంతో.. జనాలకే కాదు, ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఈ మూవీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో.. 3 టాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా.. వాటి మధ్యనే శివ గంగను కూడా రిలీజ్ చేశారు.

కనీసం ఈ మూవీ ఒకటి రిలీజ్ అవుతోందనే విషయం కూడా జనాలకు తెలియదు. ఒకటీఅరా ఛానళ్లలో అప్పుడప్పుడూ కనింపించిన యాడ్స్ తప్ప ప్రమోషన్ లేదు. బోలెడంత పబ్లిసిటీ చేస్తేనే అరాకొరా జనాలు థియేటర్లవరకూ వస్తున్న రోజులివి. అలాంటి కనీసమాత్రం ప్రచారం కూడా చేయడంతో థియేటర్లలోకి వదిలేసరికి.. పరిస్థితి దారుణంగా ఉంది. శ్రీరాం - రాయ్ లక్ష్మిల యాక్షన్ బాగానే ఉన్నా, పవన్ ఐటెం గాళ్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. అవేవీ శివ గంగను కాపాడలేకపోయాయి