Begin typing your search above and press return to search.

మోడర్న్ రత్తాలు మత్తెక్కించిందంతే

By:  Tupaki Desk   |   16 Feb 2017 12:59 PM GMT
మోడర్న్ రత్తాలు మత్తెక్కించిందంతే
X
రాయ్ లక్ష్మీ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. హీరోయిన్ గా మాంచి డిమాండ్ ఉన్న ఈ బ్యూటీ.. మొదట సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కలిసి తోబతోబ అంటూ ఆడిపాడింది. రీసెంట్ గా మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో 'రత్తాలు' అంటూ పిలిపించుకుని.. ఆడియన్స్ ను పులకరింప చేసింది.

అంతే కాదు.. ఈ భామకు సోషల్ మీడియాలో పలకరింపులు కూడా ఎక్కువే. తన మేని సొగసులు చూపిస్తూ సెల్ఫీలు తీసుకుని.. అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా రాయ్ లక్ష్మీ ఓ పింక్ డ్రెస్ లో సెల్ఫీ తీసుకుని నెట్ లో పెట్టేసింది. సోయగాల వంపుల విషయంలో పర్ఫెక్ట్ మెయిన్టెయన్ చేసే ఈ సుందరాంగి.. టాప్ యాంగిల్ లోంచి సెల్ఫీ తీసుకోవడం.. దీనికి తోడు ఆమె ధరించిన డ్రస్ కి అందాలను దాచి పెట్టే అవకాశం లేకపోవడంతో.. చూపరుల కళ్లు అన్నీ అక్కడే ఆగిపోవాల్సిందే.

అమ్మడి కళ్లలో ఎంత మత్తు దాగి ఉందో చూసే అవకాశం ఇవ్వకుండా కళ్లజోడు పెట్టేసింది కానీ.. లేకపోతే ఈ అందాలకు ఆ మైకం కూడా తోడైతే.. తట్టుకోవడం కష్టమే. తన మేని ఆస్తుల ప్రదర్శనలో ఆరితేరిపోయిన ఈ అందాల అతివ.. త్వరలో లారెన్స్ మూవీ మొట్ట శివ.. కెట్ట శివలో కూడా ఐటెం భామగా కనిపించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/