Begin typing your search above and press return to search.

మళ్లీ మొదటికొచ్చిన జూలీ యవ్వారం

By:  Tupaki Desk   |   14 April 2016 4:04 AM GMT
మళ్లీ మొదటికొచ్చిన జూలీ యవ్వారం
X
పాపం లక్ష్మి రాయ్‌. అమ్మడు పేరును అటూ ఇటూ తారుమారు చేసుకున్నా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం పెద్దగా ఫలితం ఏమీ ఉండట్లేదు. ఎందుకంటే అక్కడ రిజల్టు మాత్రం ఎప్పటిలాగానే ఉంది. ఏ మాత్రం తేడా లేదు.

లక్ష్మీ రాయ్‌ అయినా.. రాయ్‌ లక్ష్మీ అయినా.. పాపం ఫ్లాపులే పడుతున్నాయి. కనీసం పవర్‌ స్టార్‌ అయిన బ్రేక్‌ ఇస్తాడనుకుంటే.. అసలు ''సర్దార్‌'' సినిమానే ఆం ఫట్‌ అనేలా ఉంటే.. అందులో అమ్మడు చేసిన ఐటెం సాంగ్‌ అంతగా ఊర్రూతలూగించలేదు. ఈసారి దేవిశ్రీ ప్రసాద్‌ కొట్టిన మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోకపోవడం ఒకెత్తయితే.. ఈ పాటలో లక్ష్మీ రాయ్‌ ను చూస్తే పెద్దగా కిక్కురాకపోవడం మరో ఎత్తు. అందుకే ఇక సర్దార్ ను మర్చిపోయి.. హిందీలో తాను చేస్తున్న ''జూలీ 2'' సినిమాను పిచ్చపిచ్చగా ప్రమోట్‌ చేయడం స్టార్ట్‌ చేసింది ఈ సుందరి.

మాట్లాడితే బికినీలో ఉన్న తన ఫోటోలను షేర్‌ చేయడమే పని. అవి కూడా బాగా ఊరించేస్తున్నాయి అనుకోండి.. అది వేరే విషయం. కాకపోతే ఉన్నదంతా ఇప్పుడు ఆరబోస్తే.. రేపు వెండితెరపై చూడ్డానికి ఏమన్నా మిగలాలిగా. పైగా బాలీవుడ్‌ లో డెబ్యూ సినిమా ఆయే.. దాచుకోమ్మా రాయ్‌!!