Begin typing your search above and press return to search.

మంచు వారి అమ్మాయి రాకకు ముహూర్తం ఫిక్స్‌

By:  Tupaki Desk   |   17 Feb 2019 9:38 AM GMT
మంచు వారి అమ్మాయి రాకకు ముహూర్తం ఫిక్స్‌
X
ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్‌ ల టైం నడుస్తోంది. పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌ లను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించింది. దాదాపుగా షూటింగ్‌ పూర్తి అయిన ఆ వెబ్‌ సిరీస్‌ ను మార్చి 8న మహిళల దినోత్సవం సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాదారణ గృహిణి పాత్రలో మంచు లక్ష్మి నటించింది. ఈ వెబ్‌ సిరీస్‌ కు 'మిసెస్‌ సుబ్బలక్ష్మి' అనే టైటిల్‌ ను పెట్టారు.

కమెడియన్‌ కం డైరెక్టర్‌ అయిన అవసరాల శ్రీనివాస్‌ మరియు మహేష్‌ విట్టాలు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ లో మంచు లక్ష్మి నటన ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ను జీ సంస్థకు చెందిన జీ5 యాప్‌ లో ప్రసారం చేయబోతున్నారు. మంచు లక్ష్మి ఇప్పటి వరకు సినిమాల్లో నటించింది, బుల్లి తెరపై రియాల్టీ షోలకు హోస్ట్‌ గా వ్యవహరించింది, టాక్‌ షోలకు హోస్ట్‌ గా వ్యవహరించింది. మొదటి సారి వెబ్‌ సిరీస్‌ లో నటించింది. దాంతో ఈ వెబ్‌ సిరీస్‌ పై సినీ జనాల్లో కూడా ఆసక్తి నెలకొంది. మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు మంచు లక్ష్మి ఈ వెబ్‌ సిరీస్‌ ను కానుకగా ఇవ్వబోతుంది.