Begin typing your search above and press return to search.

ఆ నిర్ణయం ఆరు నిముషాల్లో తీసుకున్న రానా

By:  Tupaki Desk   |   23 May 2020 7:10 AM GMT
ఆ నిర్ణయం ఆరు నిముషాల్లో తీసుకున్న రానా
X
రానా దగ్గుబాటి - మిహీక బజాజ్ లవ్ స్టోరీ గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. రానా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. 'యస్ చెప్పింది' అంటూ ఇద్దరి ఫోటోను పోస్ట్ చేయడంతో ప్రపంచానికి రానా ప్రేమకథ తెలిసింది. ఇక రెండు రోజుల క్రితం రామానాయుడు స్టూడియోస్ లో రానా - మిహీకల కుటుంబాలు రోకా ఫంక్షన్ కూడా జరుపుకున్నాయి.

ఇదిలా ఉంటే ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి ఈ ప్రేమకథ గురించి మరిన్ని వివరాలు రాబట్టి అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఈమధ్య రానా తో ఓ లైవ్ చాట్ నిర్వహించిన మంచు లక్ష్మి ఎంతో ఒడుపుగా ఆ ప్రేమకథ పుట్టుపూర్వోత్రాలను బయటకు తీసింది. కొందరు అనుకుంటున్నట్టుగా రానా కొన్నేళ్ళ నుంచి ఈ ప్రేమకథను నడపడం లేదని.. జస్ట్ మూడు నెలల క్రితమే ప్రేమలో పడ్డారనే విషయం రానా స్వయంగా వెల్లడించాడు

అంతే కాదు. ఇంకా మిహీకకు రింగ్ కూడా ఇవ్వలేదని చెప్పాడు. మరి ఈ ప్రేమ.. ఇదంతా ఎలా అని అడిగితే "మీకు సరైన వ్యక్తి తారసపడినప్పుడు ఈ వ్యక్తితో లైఫ్ లో సెటిల్ కావాలనిపిస్తుంది. నాకు అలాగే జరిగింది" అంటూ జవాబిచ్చాడు. వెంకటేష్ బాబాయ్ కూతురు ఆశ్రిత క్లాస్ మేట్ గా మిహీక తనకు ముందు నుంచే తెలుసని అయితే ఈమధ్యే తనకి వివాహం చేసుకోవాలని అనిపించిందని తెలిపాడు. నిర్ణయం జస్ట్ 6 నిమషాల్లో తీసుకున్నానని అయితే ఒకరోజంతా దానిగురించి తర్వాత ఆలోచించానని తెలిపాడు రానా.. మొత్తానికి దగ్గుబాటి వారసుడికి పెళ్లికళ వచ్చేసింది.