Begin typing your search above and press return to search.

ల‌జ్జ‌... డోసెక్కువైంది బాసూ!

By:  Tupaki Desk   |   29 Dec 2015 7:30 AM GMT
ల‌జ్జ‌... డోసెక్కువైంది బాసూ!
X
న‌ర‌సింహ నంది అంటే ప్రేక్ష‌కులు అంత తొంద‌ర‌గా గుర్తు ప‌ట్టలేరేమో కానీ... ప‌రిశ్ర‌మ జ‌నాలు మాత్రం మంచి ద‌ర్శ‌కుడు అని ఇట్టే చెప్పేస్తారు. 1940లో ఒక గ్రామం, క‌మ‌ల‌తో నా ప్ర‌యాణంలాంటి చిత్రాల‌తో ఆయ‌న జాతీయ పుర‌స్కారాల్ని సొంతం చేసుకొన్నాడు. అయితే ఆయా చిత్రాలు విమ‌ర్శ‌కుల్ని మెప్పించినంత‌గా ప్రేక్ష‌కుల్ని మాత్రం ప్ర‌భావితం చేయ‌లేక‌పోయాయి. అంటే నేటిత‌రం ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సిన అంశాలేవో అందులో త‌క్కువ‌య్యాయ‌న్న‌దే అర్థం. అందుకేనేమో ఈసారి న‌ర‌సింహ నంది కాస్త డోసు పెంచేసి కొత్త సినిమా తీసేసిన‌ట్టున్నాడు. ల‌జ్జ పేరుతో ఆయ‌న ఓ చిత్రం చేశాడు. భార్య‌పై భ‌ర్త‌కి ప్రేమ లేక‌పోతే ఆమె మ‌న‌సులో ఎలాంటి క‌ల్లోలం మొద‌ల‌వుతుంద‌న్న విష‌యంతో ఈ చిత్రాన్ని చేశాన‌ని ఆయ‌న చెబుతున్నాడు. అలాంటి సెన్సిటివ్ విష‌యాన్ని తెర‌పై చెప్పాలంటే క‌ష్టమే.

హీరోయిజం ఉండ‌దు, ఎలాగో ఇలాంటి సినిమాల్లో స్టార్లు కూడా క‌నిపించ‌రు. సో... ఇక ఉన్న ఒకే ఒక మార్గం బోల్డ్ సీన్స్‌. సినిమాలో నాయ‌కానాయిక‌ల మ‌ధ్య బోల్డ్ సీన్స్ బాగా ఉన్న‌ట్టున్నాయి. ఆ విష‌యం ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్ల‌లోనూ క‌నిపిస్తోంది. నాయిక తడి అందాల్ని తెర‌పై బాగా చూపించేసిన‌ట్టున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ఇలాంటి పోస్టర్లు చూశాక ఫ్యామిలీ ఆడియెన్స్ థియేట‌ర్ల‌కి వ‌స్తారా అన్న‌దే ప్ర‌శ్న‌. కానీ చిత్ర‌బృందం మాత్రం కాన్ఫిడెంట్‌ గా ఉంది. బోల్డ్‌ గా ఓ అంశాన్ని చెప్పాం కానీ... స‌న్నివేశాలు మాత్రం అంత బోల్డ్‌గా ఏమీ ఉండ‌వని చెబుతోంది. కానీ పోస్ట‌ర్లు మాత్రం అందంగా యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకొనేలా క‌నిపిస్తున్నాయి.