Begin typing your search above and press return to search.

ఒకే సినిమాతో ఇద్దరు హీరోల డెబ్యూ

By:  Tupaki Desk   |   2 Sept 2018 8:00 PM IST
ఒకే సినిమాతో ఇద్దరు హీరోల డెబ్యూ
X
ఒక సినిమా తో ఇద్దరు కొత్త నటులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనే కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. బాలీవుడ్ లో ఇలాంటిది ఇప్పటికి చాలా సార్లు జరిగింది. తెలుగులో కూడా అలా ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి. కానీ ఇద్దరు నిర్మాతల తనయులు ఒకే సినిమా ద్వారా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమనేది మాత్రం తొలిసారే.

అలాంటి సంఘటన ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో జరగనుంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ - మరో నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ ఒకే సినిమా ద్వారా హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నారు. లగడపాటి విక్రమ్ గతంలో అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' లో అన్వర్ పాత్ర పోషించాడు. ఇక హీరోగా అయితే మాత్రం ఇదే తన మొదటి సినిమా.

ఈ సినిమాకు శివరాజ్ కనుమూరి దర్శకుడు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాకు శివరాజ్ దర్శకత్వం వహించాడు. మరి ఇద్దరు నిర్మాతల తనయులకోసం ఎలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు రెడీ చేసిపెట్టాడో వేచి చూడాలి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.