Begin typing your search above and press return to search.

వీడియో : బస్‌ పుట్‌ బోర్డ్‌ పై లేడీ సూపర్‌ స్టార్స్

By:  Tupaki Desk   |   24 Aug 2021 10:47 AM GMT
వీడియో : బస్‌ పుట్‌ బోర్డ్‌ పై లేడీ సూపర్‌ స్టార్స్
X
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'. విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సౌత్‌ స్టార్స్ హీరోయిన్స్‌.. లేడీ సూపర్‌ స్టార్స్ గా అభిమానులు పిలుచుకునే నయనతార మరియు సమంతలు ఈ సినిమాలో నటిస్తున్నారు. మొదటి సారి సౌత్‌ లో ఇద్దరు పెద్ద స్టార్‌ హీరోయిన్స్‌ నటిస్తున్న సినిమా అవ్వడంతో తెలుగు మరియు తమిళ ఆడియన్స్ లో అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా కు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ ను హైదరాబాద్ లో నిర్వహించారు.. కరోనా సెండ్‌ వేవ్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని ఇటీవలే కేరళ షెడ్యూల్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో లో ఇద్దరు హీరోయిన్స్ మరియు హీరో ముగ్గురు కలిసి బస్సు ఫుట్‌ బోర్డ్‌ పై ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్‌ సమంత మరియు నయన్‌ లు సేమ్ టు సేమ్‌ చీరలు కట్టుకుని ఉన్నారు. కనుక ఇద్దరు కూడా ఏదైన ఒక చోట పని చేస్తూ ఉంటారు. అక్కడ విజయ్‌ సేతుపతిని ఇష్టపడతారు. ఇద్దరు కూడా ఒకే వ్యక్తిని ప్రేమించడం.. అతడు ఇద్దరిలో ఒకరిని మాత్రమే ప్రేమించడం అలా అలా కథ సాగుతుందని ఈ వీడియోను చూసి కొందరు ఊహించేసుకుంటున్నారు.

మొత్తానికి కాతువాకుల రెండు కాదల్‌ సినిమా కు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రతి సన్నివేశంలో కూడా నయన్ మరియు సమంతలు పోటీ పడి మరీ నటించారు అని.. ఇద్దరికి సమాన ప్రాముఖ్యత ను కల్పించిన దర్శకుడు విఘ్నేష్‌ శివన్ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని తర్వాత సినిమాను పట్టాలు ఎక్కించాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెంచేలా వీరిద్దరి ఫుట్‌ బోర్డింగ్‌ ప్రయాణం ఉంది అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా తెల్ల చీర మరియు వంకాయ కలర్‌ బ్లౌజ్ లతో చూడ ముచ్చటగా సింపుల్‌ గా ఉన్నారు. సినిమాను తెలుగు లో ఏ టైటిల్ తో విడుదల చేస్తారు అనే విషయమై త్వరలో క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.