Begin typing your search above and press return to search.
లేడీ సూపర్ స్టార్ నాలుగు దశాబ్ధాల కెరీర్
By: Tupaki Desk | 13 Sept 2020 11:00 PM IST`సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. మహేష్ కి ధీటైన పాత్రతో ఆకట్టుకున్నారు. ఇక యాథృచ్ఛికంగానే ఇలా జరిగినా నిజానికి విజయశాంతికి తొలి అవకాశం ఇచ్చింది మహేష్ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ.
విజయశాంతి నటించిన తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు. ఇందులో కృష్ణ సరసన విజయశాంతి నటించారు. ఈ మూవీ రిలీజై 40 సంవత్సరాలైన సందర్భంగా విజయశాంతి ఓసారి నాటి రోజుల్ని తలుచుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసక్తికరంగా ఈ మూవీకి కృష్ణ సతీమణి లేడీ డైనమిక్ డైరెక్టర్ విజయనిర్మల దర్శకత్వం వహించారు. ఈ విషయాలన్నీ విజయశాంతి ట్విట్టర్ లో తెలిపారు.
నాలుగు దశాబ్దాల పయనంలో నన్ను ఎంతో సహృదయతతో ఆదరించి అనేక అద్భుత విజయాలను అందించిన అభిమానులు తెలుగు ప్రేక్షకులందరికీ విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ .. ఆంటీ విజయనిర్మల గారికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
ఆరంభం ఒక సాధారణ కథానాయికగా తెరకు పరిచయమై డీగ్లామరస్ రోల్స్ లోనూ నటించి మెప్పించిన విజయశాంతి ఆ తర్వాత గ్లామరస్ నాయికగానూ తనని తాను మెరుగుపరుచుకున్నారు. స్టార్ హీరోల సరసన ఆఫర్లతో స్టార్ డమ్ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ గా పాపులరయ్యారు. ఇటీవల తన స్థాయికి తగ్గ పాత్రతో తెర పై రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తదుపరి పలు క్రేజీ సినిమాల్లో నటించేందుకు అంగీకరించనున్నారన్న సమాచారం ఉంది.