Begin typing your search above and press return to search.
లేడీ సూపర్ స్టార్ బాలీవుడ్ డెబ్యూ పాత్ర క్లారిటీ
By: Tupaki Desk | 11 Nov 2021 6:00 AM ISTసౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. సౌత్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న షారుఖ్ మూవీతో నయనతార బాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. ఇప్పటికే ఆమె నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఓటీటీ మరియు శాటిలైట్ ద్వారా ఇప్పటి వరకు హిందీ ప్రేక్షకులకు చేరువ అయిన నయనతార మొదటి సారి హిందీలో నేరుగా సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అట్లీ భారీ యాక్షన్ డ్రామాను షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో నయనతార పాత్ర ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తమిళ మీడియా నుండి లీక్ అందుతోది.
షారుఖ్ కు జోడీగా ఒక కమర్షియల్ పాత్ర అని కాకుండా నయనతార చాలా పవర్ ఫుల్ రోల్ లో ఆకట్టుకునే కాప్ రోల్ లో కనిపించబోతుందట. షారుఖ్ ఖాన్ మరియు నయనతార ల మద్య ఉండే సన్నివేశాలు చాలా విభిన్నంగా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో షారుఖ్ మరియు నయనతారల మద్య రొమాన్స్ ఉండక పోవచ్చు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. షారుఖ్ కు ఏమాత్రం తగ్గని పాత్రలో ఈమె కనిపించబోతుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయినట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఇప్పటికే పఠాన్ అనే సినిమాను చేశాడు. ఆ సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి షారుఖ్ మూడేళ్ల గ్యాప్ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫిల్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న పఠాన్ మరియు అట్లీ సినిమాలు వచ్చే ఏడాది తక్కువ గ్యాప్ లోనే రాబోతున్నాయి. అట్లీ సినిమాలో నయన్ నటించడం వల్ల సౌత్ లో కూడా మంచి మార్కెట్ ను ఈ సినిమా దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.