Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ చెంప పగలగొట్టిన లేడీ

By:  Tupaki Desk   |   4 March 2016 1:30 PM GMT
సూపర్ స్టార్ చెంప పగలగొట్టిన లేడీ
X
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్.. అంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ ఉంటారు కానీ.. చెంప పగలకొట్టే వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది నిజమే. ఈ విషయం స్వయంగా చెప్పాడు షారూక్ ఖాన్. ఓ సారి ట్రైన్ లో ఓ లేడీ తనను చెంపదెబ్బ కొట్టిందని, నొప్పి తగ్గడానికి చాలా టైం పట్టిందని కూడా అన్నాడు. అసలేం జరిగిందో కూడా డీటైల్డ్ గా చెప్పాడు షారుక్.

ప్రస్తుతం ఫ్యాన్ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న ఈ కింగ్ ఖాన్ ను.. మీరు మొదటి సారి ముంబై వచ్చినపుడు ట్రైన్ లో వచ్చారా.. ఫ్లైట్ లో వచ్చారా అని అడిగాడు ఓ వ్యక్తి. ట్రైన్ లోనే ముంబై వచ్చానని సమాధానం ఇచ్చిన బాద్ షా.. ఆ సమయంలో తనకు ఎదురైన ఓ అనుభవం కూడా పంచుకున్నాడు. షారూక్ ఎక్కిన ట్రైన్.. ముంబై పరిసరాల్లోకి రాగానే లోకల్ గా మారిపోతుందట. ఈ విషయం తెలియని కింగ్ ఖాన్.. తన సీట్ పై ఎవరినీ కూర్చోనివ్వలేదట. అది నాది.. నేను రిజర్వ్ చేసుకున్నానని అన్నాడట.

కానీ ఓ మహిళకు మాత్రం సీట్ ఆఫర్ చేసిన షారుక్.. ఆమెతో ఉన్న మగవాళ్లను మాత్రం కూర్చోనివ్వను అని చెప్పాడట. దీంతో ఒళ్లు మండిన ఆమె.. షారుక్ ఖాన్ చెంపపై లాగి పెట్టి ఒకటి గట్టిగా ఇచ్చుకుందట. ఇది నీ సీటు కాదు.. అందరిదీ అని చెప్పి వెళ్లిపోయిందట. ఇది మాత్రం తన జన్మలో మర్చిపోలేనని చెప్పాడు షారూక్. అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా... ముంబై వచ్చే ముందు జరిగిన సంఘటన గుర్తుందంటే.. గట్టిగానే కొట్టిందన్న మాట.