Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ కథతో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ప్లాన్‌..?

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 PM GMT
కేజీఎఫ్‌ కథతో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ప్లాన్‌..?
X
ప్రశాంత్‌ నీల్‌ మరియు యశ్ లు కేజీఎఫ్‌ తో పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకున్నారు. యశ్‌ వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరో వైపు ప్రశాంత్‌ నీల్ మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా సలార్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సలార్‌ సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. ఈ ఏడాది చివరి వరకు సలార్‌ ను ముగించబోతున్నారు.

సలార్‌ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా గురించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఆ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ మరో ఇద్దరు ముగ్గురు తెలుగు హీరోలతో కూడా సినిమాలను చేసేందుకు చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

ప్రశాంత్ నీల్‌ ఒక లేడీ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్ ను కేజీఎఫ్‌ బ్యాక్ డ్రాప్ లో రెడీ చేశాడు అనే వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్‌ లోకి రాఖీ భాయ్ ఎంటర్ అయిన తర్వాత జన్మించిన మొదటి అమ్మాయి చాలా పవర్ ఫుల్‌ గా మారి కేజీఎఫ్ ను తన హస్తగతం చేసుకుంటుంది. రాఖీ భాయ్‌ చనిపోయిన తర్వాత ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆమె పని చేస్తూ మళ్లీ కేజీఎఫ్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుందట.

ఆ లేడీ రాఖీ భాయ్ కథ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని.. రాఖీ భాయ్ కంటే మరీ దారుణంగా మాస్ ఎలిమెంట్స్ తో హీరోయిన్‌ పాత్రను ప్రశాంత్‌ నీల్‌ ఆ స్క్రిప్ట్ లో రాసుకున్నాడు అంటూ కన్నడ మీడియా వర్గాల్లో చర్చ వినిపిస్తుంది. కేజీఎఫ్ 2 సినిమా ముగింపు తర్వాత జరిగిన కథతో కేజీఎఫ్ 3 గా ఆ లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతోంది.

హీరోయిన్‌ గా వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఒక స్టార్‌ హీరోయిన్‌ ను ప్రశాంత్‌ నీల్ ఈ సినిమాకోసం అనుకుంటున్నాడట. సంవత్సరం పాటు షూటింగ్ చేయాల్సి ఉంటుందని కూడా సమాచారం అందుతోంది.

మరో వైపు ఇవన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. కేజీఎఫ్ 2 లో లేడీ రాఖీ భాయ్ గా కనిపించబోతుంది అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో కాని నిజం అయితే బాగుండు అనుకునే వారు ఉన్నారు.