Begin typing your search above and press return to search.
లేడీ మల్టీస్టారర్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ !!
By: Tupaki Desk | 2 Oct 2021 10:00 AM ISTలేడీ సూపర్ స్టార్ నయనతార మరో స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన చిత్రం కథు వాకుల రెండు కాదల్. ఈ సినిమాకు నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ సినిమాను చాలా విభిన్నమైన నేపథ్యంలో రూపొందించాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను ముగించిన చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సినిమాను మొన్నటి వరకు థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో పాటు చాలా సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లేడీ మల్టీస్టారర్ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు గాను చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది.
సమంత మరియు నయనతారలకు కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే తెలుగు మరియు తమిళ భాషల్లో రైట్స్ ను ప్రముఖ ఓటీటీ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించిన కథు వాకుల రెండు కాదల్ ను దీపావళి కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అనధికారిక సమాచారం ప్రకారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు గాను ఒప్పందం జరిగిందట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ 4 న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఈమద్య కాలంలో చేసిన సినిమాలు మరియు పాత్రలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఆయన నటుడిగా సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ గా మంచి గుర్తింపు దక్కించుకుంటున్నాడు.
ఇక ఇద్దరు హీరోయిన్స్ విషయానికి వస్తే నటన మరియు అందం విషయంలో ఇద్దరు కూడా పోటీ పడి మరీ నటిస్తారు. అలాగే సినిమాలో కూడా ఒక వ్యక్తి ప్రేమ కోసం పోటీ పడతారని.. ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉంటాయని తమిళ మీడియా వర్గాలతో విఘ్నేష్ శివన్ అన్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ను కరోనా టైమ్ లోనే ముగించారు. మొత్తంగా సినిమా షూటింగ్ ను ముగించిన చిత్ర యూనిట్ సభ్యులు మరీ ఆలస్యం చేయకుండా థియేటర్ రిలీజ్ కు వెయిట్ చేయకుండా సినిమాను విడుదల చేసేందుకు గాను ఓటీటీ కి ఇవ్వడం జరిగిందని సమాచారం అందుతోంది. ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోస తెలుగు మరియు తమిళ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నయనతార గత చిత్రాలు కూడా ఓటీటీ ద్వారా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా సెంటిమెంట్ తో సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.