Begin typing your search above and press return to search.

లేడీ కమెడియన్‌ పెళ్లి సందడి మొదలు

By:  Tupaki Desk   |   9 Aug 2021 10:58 AM GMT
లేడీ కమెడియన్‌ పెళ్లి సందడి మొదలు
X
తమిళం మరియు తెలుగులో పలు సినిమాల్లో నటించి లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న విద్యు రామన్ పెళ్లి హడావుడి మొదలు అయ్యింది. ఇప్పటికే వీరి వివాహ నిశ్చితార్థం కరోనా కారణంగా నిరాడంబరంగా సాగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గిపోయిన నేపథ్యంలో విద్యు రామన్ పెళ్లి సందడి మొదలు అయ్యింది. భారీగా ఈమె పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయట. కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. టాలీవుడ్‌ లో తనకు ఉన్న సన్నిహితులకు కూడా విద్యు రామన్‌ ఆహ్వానాలు పంపించింది. పెళ్లి వేడుకలో హంగామా భారీ ఎత్తున ఉంటుందని ఆమె సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.

ఫిట్ నెస్‌ ట్రైనర్‌ అండ్‌ న్యూట్రీషియన్ ఎక్స్‌ పర్ట్‌ అయిన సంజయ్‌ తో విద్యు రామన్‌ పెళ్లి జరుగబోతుంది. వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తారు. నిశ్చితార్థం అయినప్పటి నుండి కూడా సోషల్‌ మీడియాలో సంజయ్ మరియు విద్యు రామన్ ల ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన హడావుడి కూడా తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తుంది. మొత్తానికి విద్యు రామన్‌ పెళ్లి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కి ముందు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం బ్రైడ్ స్క్వాడ్ తో కలిసి విద్యు బ్యాచిలర్ లైఫ్‌ చివరి రోజులను ఎంజాయ్‌ చేస్తుంది.

వెడ్డింగ్ ఈవెంట్‌ ను ప్రముఖ ఈవెంట్ సంస్థ నిర్వహిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. నటిగా తమిళ సినీ ఇండస్ట్రీలో 2012 లో అడుగు పెట్టిన విద్యు రామన్ తక్కువ సమయంలోనే మంచి సినిమాలు చేసింది. తెలుగు లో ఈమెకు అనూహ్యంగా ఆఫర్లు వచ్చాయి. కాస్త లావుగా ఉండటంతో పాటు ఈమె వాయిస్ విభిన్నంగా ఉండటం మరియు ఆకట్టుకునే నటనతో ఈమె కెరీర్‌ లో దూసుకు పోతుంది. వందల సినిమాల్లో ఇప్పటికే నటించేసిన విద్యు రామన్‌ ఈమద్య కాలంలో చాలా బరువు తగ్గింది. దాంతో ఈమెకు హీరోయిన్ గా ఆఫర్లు వస్తాయంటూ నెటిజన్స్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా నటిగా కెరీర్ ను కొనసాగించాలనే పట్టుదలతో ఈమె ఉంది. మరి ఈమెకు హీరోయిన్ గా ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.