Begin typing your search above and press return to search.

టైగర్ తో పోటీకి సై అంటున్న రాక్షసి

By:  Tupaki Desk   |   26 Nov 2015 3:30 PM GMT
టైగర్ తో పోటీకి సై అంటున్న రాక్షసి
X
అందాల రాక్షసి ఎవరు అని ఎవరినైనా అడిగితే.. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఇచ్చే ఒకే ఆన్సర్ లావణ్య త్రిపాఠి అనే. ఒక్క మూవీతోనే అంతటి క్రేజ్ సొంతం చేసేసుకుంది ఈ భామ. అచ్చ తెలుగులా అమ్మాయిలా కనిపించడం అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ లావణ్యకి.

చిన్న హీరోల నుంచి స్టార్ల వరకు అందరూ ఈ చిన్నదాన్ని విపరీతంగా పొగిడేస్తున్నారు. వీరిలో కొందరు ఛాన్సులు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నారు. భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తో సూపర్ ఫాంలో ఉన్న లావణ్య త్రిపాఠి.. తన నెక్ట్స్ వెంచర్ ని రిలీజ్ కి రెడీ చేసేసింది. ఇప్పుడీ సుందరి నటించిన లచ్చిందేవికి ఒక లెక్కుంది చిత్రం విడుదలకు సిద్ధమైంది. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ చేసుకున్న లచ్చిందేవి.. రిలీజ్ లెక్కలు ఫిక్స్ చేసేసుకోవడం విశేషం.

జగదీష్ తలశిల డైరెక్షన్ లో రూపొందిన లచ్చిందేవికి ఓ లెక్కుంది.. డిసెంబర్ 11 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ విడుదల చేస్తున్నట్లు రవితేజ్ ప్రకటించాడు. ఇప్పుడు ఒక రోజు గ్యాప్ లో రానుండడంతో.. అందాల రాక్షసి, మాస్ రాజాతో పోటీకి సై అంటోందని అర్ధమవుతోంది. పోస్టర్లతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన లచ్చిందేవిపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.