Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: లాఠీ ప‌వ‌రేంటో! చూపించాడు

By:  Tupaki Desk   |   12 Dec 2022 12:58 PM GMT
ట్రైల‌ర్ టాక్: లాఠీ ప‌వ‌రేంటో! చూపించాడు
X


స్టార్ హీరో విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడి తమిళ యాక్షన్ సినిమాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `లాఠీ` రూపొందుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ - నందా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా హీరోయిన్ గా నటిస్తోంది.


తెలుగు- తమిళం- హిందీ- కన్నడ- మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అన్ని భాషలకు ఒకే టైటిల్ ను ఖరారు చేశారు. సరికొత్త కథాంశంతో వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

లాఠీకి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉంది. ఆ `లాఠీ`తో విశాల్ సమాజంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడన్నది తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో విశాల్ పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నాడు. సెకండాఫ్ లో 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు ప్రీటీజర్ ని బట్టి విశాల్ మరో లెవల్ యాక్షన్ మూవీలో నటించాడని అర్థమవుతోంది.

తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్ లోనే లాఠీ ప‌వ‌రేంటో చూపించాడు. విశాల్ మార్క్ యాక్ష‌న్..పెర్పార్మెన్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. లాఠీ స్పెష‌లిస్ట్ ముర‌ళీ రంగంలోకి దిగితే ఎవ‌రికైనా సీన్ సితారే అవ్వాల్సిందే అన్న‌ట్లు ప‌వ‌ర్ ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. `లాఠీ దెబ్బ‌కు నిజం క‌క్కాలి`..`నీలాంటి వాళ్ల‌ను చేతికి లాఠీ ఇచ్చి కొట్ట‌మంటే పై వాళ్లు మాకు ఇచ్చేది ఆర్డ‌ర్ కాదురా..ఆఫ‌ర్`` లాంటి డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇందులో ఓ మంచి ఫ్యామిలీ పోలీస్ ని కూడా చూపించారు. ఈ లాఠీ పోలీస్ కాస్త రొమాంటిక్ గానూ క‌నిపిస్తున్నాడు. టైటిల్ కి త‌గ్గ‌ట్టు ట్రైల‌ర్ లో ఆద్యంతం లాఠీని బాగా హైలైట్ చేసారు. తుపాకులతోనే కాదు వ్య‌వ‌స్థ‌ని లాఠీతోనూ ఎలా అదుపు చేయోచ్చో ఈ పోలీస్ చూపించాడు. లాఠీ పోలీస్ చేతిలోభారీ స‌మ్మెట చేత ప‌డితే ఎలా ఉంటుందో కూడా హైలైట్ చేసారు. మ‌రి ఈ లాఠీ పోలీసు పుల్ ర‌న్ లో ఇంకెలాంటి విశ్వ‌రూపం చూపిస్తాడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.