Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్‌: ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ గాడు `లాఠీ`తో ఇర‌గ‌దీశాడు!

By:  Tupaki Desk   |   24 July 2022 8:04 PM IST
టీజ‌ర్ టాక్‌: ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ గాడు `లాఠీ`తో ఇర‌గ‌దీశాడు!
X
ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ సినిమాల‌తో అద‌ర‌గొట్ట‌డం విశాల్ స్టైల్. చెన్నైలో సెటిలైనా తెలుగు కుర్రాడే కాబ‌ట్టి ఇక్క‌డా అత‌డికి భారీ ఫాలోయింగ్ ఉంది. పందెంకోడి మొద‌లు అతడు ప్ర‌తిసారీ భారీ యాక్ష‌న్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.

ఈసారి లాఠీ (ల‌త్తి -త‌మిళం) అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ టీజ‌ర్లు పోస్ట‌ర్ల‌లో విశాల్ క్రౌర్యం హీట్ పెంచాయి. ఒక పోలీసాఫీస‌ర్ గా అత‌డి నిజాయితీ తెగువ ప్రతిదీ ఆవిష్క‌రిస్తూ ఇప్పుడు టీజ‌ర్ దూసుకొచ్చింది. ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ గాడు! అంటూ విల‌న్ ఎంత‌గా ఆ్రక్రోశిస్తుంటే అంత‌గా విశాల్ యాక్ష‌న్ తో స‌మాధాన‌మిస్తున్నాడు. ఇక ఈ మూవీలో భారీ స్టంట్స్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని ప్రూవ్ చేస్తూ ఒక భారీ భ‌వంతిలో క్రౌడ్స్ న‌డుమ కాప్ యాక్ష‌న్ సీన్ ని మ‌రో లెవ‌ల్లో క్రియేట్ చేసారు. ఆ సీన్ సినిమాకే హైలైట్ గా ఉండ‌నుంద‌ని టీజర్ ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

రేయ్..! త‌ప్పు చేసి త‌ల‌దాచుకునే పోకిరీవి నీకే ఇంత పొగ‌రుంటే.. ఆ త‌ప్పును నిల‌దీసే పోలీసోడిని.. నాకు ఎంత పొగ‌రుంటుంది!! అంటూ విశాల్ చెబుతున్న డైలాగ్ యాక్ష‌న్ స్టేజ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. ఊళ్లో ఉన్న పోకిరిగాళ్లంతా న‌న్ను లేపేయ‌డానికే క‌ద‌రా ప్లాన్ చేసారు.. ఇప్పుడు రండ్రా అంటూ ఆ లాఠీని మాత్రం విశాల్ విడిచిపెట్ట‌లేదు. అంత‌మంది గూండాల న‌డుమ లాఠీతోనే ఉరుకుతూ ముందుకెళ్ల‌డం కొంత అన్ రియ‌లిస్టిక్ గా ఉన్నా.. అప్పుడ‌ప్పుడూ గూండాల‌పై గ్ర‌నేడ్ లు బాంబులు విసురుతూ అత‌డు బ్యాలెన్స్ చేశాడు. ఈ వీడియోతో మాస్ మ‌సాలా యాక్ష‌న్ కి కొద‌వేమీ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి పూర్తి సినిమాలో ఇది ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతుందో చూడాలి.

విశాల్ కథానాయకుడిగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `లాఠీ` ( LATHTHI) ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ - నందా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ లో విశాల్ గాయపడడం .. ఫైట్ సీక్వెన్స్ ల కోసం భారీ VFS వర్క్ కారణంగా మేకర్స్ ఈ సినిమా విడుదలను ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 15 కి వాయిదా వేశారు. లాఠీ సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. తెలుగు- తమిళం- హిందీ- కన్నడ- మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అన్ని భాషలకు ఒకే టైటిల్ ను ఖరారు చేశారు. సరికొత్త కథాంశంతో వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

లాఠీకి సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉంది. ఆ `లాఠీ`తో విశాల్ సమాజంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడన్నది తెర‌పైనే చూడాలి. ఈ చిత్రంలో విశాల్ పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నాడు. సెకండాఫ్ లో 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్న చ‌ర్చా ఉంది. తాజా టీజ‌ర్ హైప్ ని పెంచుతోంది. విశాల్ మార్క్ యాక్ష‌న్ మూవీని వీక్షించేందుకు అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. లాఠీ ఆశించిన మార్క్ తో నే వ‌స్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైలర్ తో మ‌రింత హైప్ పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.