Begin typing your search above and press return to search.

అస్కార్ నామినేషన్లలో ‘లా లా’ సందడి

By:  Tupaki Desk   |   25 Jan 2017 4:53 AM GMT
అస్కార్ నామినేషన్లలో ‘లా లా’ సందడి
X
బాలీవుడ్ భామ దీపికా పదుకునే ఈ మధ్యన మాట్లాడుతూ ‘లా లా ల్యాండ్’ గురించి చాలా గొప్పగా చెప్పేసింది. తనకు ఆ సినిమా తెగ నచ్చేసిందని.. ఆ చిత్ర హీరోతో నటించాలన్న కోరిక ఉందని.. తనకా అవకాశం ఖాయంగా లభిస్తుందని చెబుతూ.. ఆ సినిమా గురించి తెగ పొగిడేసింది. లా లా ల్యాండ్ సగటు సినీ ప్రేక్షకుల్నే కాదు.. సెలబ్రిటీల మనసుల్ని సైతం ఎంతగా దోచుకుందనటానికిదో నిదర్శనం.

ప్రపంచ సినిమా రంగానికి తలమానికమైన అస్కార్ అవార్డుల నామినేషన్లను ప్రాధమికంగా ఎంపిక చేసిన చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. ఈ జాబితాను చూస్తే.. లా లా ల్యాండ్ దుమ్ము రేపేసిందని చెప్పాలి. మొత్తం 14 విభాగాల్లో ఎంట్రీలను సాధించి.. తిరుగులేని విధంగా నిలిచింది. 88వ అకాడమీ అవార్డుల కోసం వచ్చిన చిత్రాల్లో తుదిపోటికి ఎంపికైన చిత్రాల జాబితాను.. విభాగాలను తాజాగా ప్రకటించారు. వీటిలో లా లా ల్యాండ్ 14 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. గతంలో టైటానిక్.. ఆల్ అబౌట్ ఈవ్ చిత్రాలు కూడా ఇదే రీతిలో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. ఉత్తమ చిత్రం కోసం తొమ్మిది చిత్రాలు పోటీ పడుతుండగా.. ఉత్తమ నటుడు.. నటి.. దర్శకుడి విభాగాల్లో ఐదుగురు చొప్పున పోటీ పడుతున్నారు. ఈ ఏడాది అస్కార్ రేసులో లా లా ల్యాండ్ ముందంజలో ఉండేలా కనిపిస్తోంది. అస్కార్ నామినేషన్ కు ఎంపికైన జాబితాను చూస్తే..

ఉత్తమ చిత్రం

1. అరైవల్ (Arrival)

2. ఫెన్సెస్ (Fences)

3. హక్సా రిడ్జ్ (Hacksaw Ridge)

4. హెల్ ఆర్ హై వాటర్ (Hell or High Water)

5. హిడెన్ ఫిగర్స్ (Hidden Figures)

6. లా లా ల్యాండ్ (La La Land)

7. లైన్ (Lain)

8. మాంచెస్టర్ బై ది సీ (Manchester by the sea)

9. మూన్‌లైట్ (Moonlight)

ఉత్తమ నటుడు

1. క్యాసీ అఫ్లెక్ (సినిమా-మాంచెస్టర్ బై ది సీ)

2. ఆండ్రూ గ్యారీఫీల్డ్ (సినిమా-హక్సా రిడ్జ్)

3. ర్యాన్ గాస్లింగ్ (సినిమా-లా లా ల్యాండ్)

4. విగ్గో మార్టెన్సన్ (సినిమా-కెప్టెన్ ఫెంటాస్టిక్)

5. డెంజల్ వాషింగ్టన్ (సినిమా- ఫెన్సెస్)

ఉత్తమ నటి

1. ఇస్బెల్లె హస్పర్ట్ (సినిమా-ఎల్లె)

2. రూత్ నెగ్గా (సినిమా-లవింగ్)

3. నటలీ పోర్ట్‌మన్ (సినిమా-జాకీ)

4. ఎమ్మా స్టోన్ (సినిమా-లా లా ల్యాండ్)

5. మెరైల్ స్ట్రీప్ (సినిమా-ఫ్లోరెన్స్ ఫోస్టర్ జెంకిన్స్)

ఉత్తమ దర్శకుడు

1. డమైన్ చజెల్లె (సినిమా-లా లా ల్యాండ్)

2. మెల్ గిబ్సన్ (సినిమా-హక్సా రిడ్జ్)

3. బ్యారీ జెంకిన్స్ (సినిమా-మూన్‌లైట్)

4. కెన్నెత్ లొనెర్గన్ (సినిమా-మాంచెస్టర్ బై ది సీ)

5. డెనిస్ వెల్లెన్యూ (సినిమా- అరైవల్)